51) యూరోపియన్ లైబ్రరీలో ఒక బీరువాలోని పుస్తకాలు ఇండియా మరియు అరేబియాలోని మొత్తం సాహిత్యానికి సమానమని ఎవరు అన్నారు?
A) పి. ఇ. రాబర్ట్స్
B) వి.ఎ.స్మిత్
C) మెకాలే
D) లార్డ్ కర్జన్
52) ప్రకరణ 248 ప్రకారం రాజ్యాంగం అవశిష్ట అధికారాలను పార్లమెంటుకు ఇచ్చింది ‘అశిష్ట అధికారాలు’ అనగానేమి?
A) మూడు జాబితాలలోని ఏ అంశంపైననైన చట్టాలు చేసే పార్లమెంటుకు ఉండే సుప్రీం పవర్
B) ఉమ్మడి జాబితాలోని అంశంపై రాష్ట్రం చేసిన చట్టంను పార్లమెంటు తిరస్కరించే అధికారం
C) ఏ జాబితాలో లేని అంశాలపై పార్లమెంటు చట్టం చేసే ప్రత్యేక అధికారాలు
D) ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ట్ర శాసన సభలకు చట్టాలు చేసే ప్రత్యేక అధికారం
53) 263వ ప్రకరణ రాష్ట్రాల మధ్య సంయమనం కొరకు ఒక అంతర్ రాష్ట్ర కౌన్సిలు ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది. అంతర్ రాష్ట్ర కౌన్సిల్ విధులకు సంబంధించి వీటిని పరిశీలించి, క్రింద ఇవ్వబడిన కోడుల ద్వారా జవాబును ఎంచుకొనుము:
a.రాష్ట్రాల మధ్య తలయెత్తే తగదాలను విచారించడం, వాటిపై సలహాలు ఇవ్వడం
b.ఒకటి లేదా రెండు, కొన్ని లేదా అన్నీ రాష్ట్రాలకు ఉమ్మడి ఆసక్తి · గల అంశాలపై విచారణ, చర్చ చేయడం
c.విధాన రూపొందన, అమలుకు సంబంధించి ఏ అంశంపైన అయిన సరైన సంయమనం తెచ్చేందుకు సూచనలు చేయడం.
d.కౌన్సిల్ ఇచ్చిన తీర్పు అన్నీ రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలి.
A) a,c,d సరైనవి b తప్పు
B) a,d సరైనవి b,c తప్పు
C) a,b సరైనవి c,d తప్పు
D) a,b,c సరైనవి d తప్పు
54) వెట్టి చాకిరీ వ్యవస్థ రద్దు చేయబడినది.
A) 25 నవంబర్, 1975
B) 25 అక్టోబర్, 1976
C) 24 అక్టోబర్, 1975
D) 24 అక్టోబర్, 1976
55) ఈ క్రింది చైనా యాత్రికులలో గుప్తుల కాలంలో భారతదేశాన్ని సందర్శించినది ఎవరు?
A) పాహియాన్
B) హ్యుయాన్ సాంగ్
C) ఇతి సంగ్
D) హ్యూలీ