66) ఈ కమిషనుల స్థాయికి సంబంధించి వీటిని గమనించి క్రింది కోడుల ద్వారా జవాబును ఎంచుకొనుము:
a.జాతీయ షెడ్యూలు కులాల కమీషన్: ఒక చట్ట సంస్థ
b.జాతీయ మహిళా కమీషన్: ఒక రాజ్యాంగ సంస్థ
c.జాతీయ షెడ్యూలు తెగల కమీషన్: ఒక రాజ్యాంగ సంస్థ
d.జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్: ఒక చట్ట సంస్థ
A) a,b సరైనవి c,d తప్పు
B) c,d సరైనవి a, b తప్పు
C) a,c,d సరైనవి b తప్పు
D) a,b,d సరైనవి c తప్పు
67) స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రచించే చారిత్రాత్మక విధిని భారత రాజ్యాంగ నిర్మాణ సభ దాదాపు 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసింది. ముసాయిదా రాజ్యాంగాన్ని చర్చించడానికి ఎన్ని సమావేశాలు, ఎన్ని రోజుల సమయం తీసుకున్నారు.
A) 10 సమావేశాలు, మొత్తం 220 రోజులు
B) 09 సమావేశాలు, మొత్తం 360 రోజులు
C) 12 సమావేశాలు, మొత్తం 245 రోజులు
D) 11 సమావేశాలు, మొత్తం 165 రోజులు
68) పార్లమెంట్ లోని ఉభయ సభలకు లేదా రాష్ట్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల వివాదాలను ఈ కింద పేర్కొనబడిన సంస్థ ఎలక్షన్ పిటిషన్ ద్వారా విచారిస్తుంది?
A) హైకోర్టులు
B) కేంద్ర ఎలక్షన్ కమిషన్
C) ఎలక్షన్ ట్రిబ్యునల్లు
D) సుప్రీంకోర్టు
69) ఈ క్రింది వారిలో మొగల్ ఆస్థానంలో గొప్ప గాయకుడు ఎవరు?
A) బైజు బవర
B) పర్వేజ్
C) తాన్ సేన్
D) మీరాబాయి
70) హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుటకు ‘విజన్ డాక్యుమెంట్’ దార్శనిక పత్రంను రూపొందించే బాధ్యతను ఏ సంస్థకు అప్పగించారు?
A) హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ (HUDA)
B) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC)
C) GMR కన్సల్టెన్సీ
D) హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ (HMDA)