81) మునిసిపాలిటీలకు రాజ్యాంగంలోని 12వ షెడ్యూలులోని అంశాలపై కార్యక్రమాలు చేపట్టే అధికారం ఉన్నది. క్రింది వానిలో ఒకటి దానిలో భాగం కాదు:
A) భూ వినియోగ నియంత్రణ, భవనాల నిర్మాణం
B) గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు నీటి సరఫరా
C) తపాలా, టెలిగ్రాపులు, టెలిఫోనులు, వైర్లెస్, బ్రాడ్కాస్టింగ్, తదితర కమ్యూనికేషన్ సాధనాలు
D) ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికలు
82) ఈ వ్యాఖ్యలను పరిశీలించుము.
A) భారతదేశంలోని లింగ నిష్పత్తి స్త్రీలకు అనుకూలంగా ఉంది.
B) తెలంగాణ లింగ నిష్పత్తి జాతీయ సరాసరి కన్నా ఎక్కువగా ఉంది.
A) A,B రెండూ సరియైనవి.
B) A సరియైనవి B తప్పు
C) A తప్పు B సరియైనవి
D) A,B రెండూ తప్పు
83) గ్లోబల్ జెండర్ గ్యాప్ ను పరిశీలించే చర రాశులు ఏవి?
A) ఆర్థిక భాగస్వామ్యం
B) విద్యలో పురోగతి
C) ఆరోగ్యం
D) రాజకీయ సాధికారత
A) A & B మాత్రమే
B) A & D మాత్రమే
C) A,B,C & D
D) A,B & D మాత్రమే
84) ఇన్ఫర్మేషన్ టెక్నాలోజీ చట్టం, 2000లోని ప్రకరణ 66Aను సుప్రీం కోర్టు శ్రేయ సింఘాల్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ క్రింది ప్రాథమిక హక్కునకు భంగం వాటిల్లేదిగా ఉందని కొట్టివేసింది:
A) వాక్, భావ ప్రకటన స్వాతంత్య్రం
B) ఏ వృత్తినైనా, వ్యాపారంనైన చేసుకునే స్వాతంత్య్రం
C) విద్యా హక్కు
D) సమాచార హక్కు
85) క్రింది విధులను పరిగణించుము.
a.నూతన రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు కేంద్ర శాసన సభగా పనిచేయడం
b.రాజ్యాంగ రచనా ప్రక్రియను కొనసాగించి పూర్తి చేయడం
c.రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ గా వ్యవహరించడం.
పైన పేర్కొనబడిన విధులలో వేటిని భారత రాజ్యాంగ నిర్మాణ సభకు అప్పగించారు?
కోడులు:
A) a & b
B) b & c
C) c & a
D) a,b & c