86) ప్రముఖ నాటకం “నా భూమి” దేనితో సంబంధం కలిగి ఉంది?
A) సామాజిక సంస్కరణదోద్యమం
B) తెలంగాణ సాయుధ పోరాటం
C) భూదానోద్యమం
D) గిరిజనోద్యమం
87) ఈ క్రింద పొందుపరచిన కోడ్ ఆధారంగా లిస్టు-Iను లిస్టు-II తో జతపరుచుము.
లిస్టు-I(ప్రదేశం)
లిస్టు-II(నది)
a.కాలిబంగాన్
1.సట్లెజ్ నది
b.చన్హుదారో
2.హిందన్ నది
c.రూపార్
3.ఇండస్ నది
d.ఆలంగిర్ పూర్
4.ఘుఘ్గర్ నది
5.జీలం నది
A) a-1,b-2,c-5,d-3
B) a-1,b-3,c-5,d-4
C) a-4,b-3,c-1,d-2
D) a-4,b-2,c-3,d-1
88) హైదరాబాద్ లో ‘హ్యుమానిటేరియన్ లీగ్’ అనే సంస్థను స్థాపించిందెవరు?
A) కేశవ రావు
B) అబ్దుల్ ఖయ్యుం
C) రాయ్ బాలముకుంద్
D) ప్రేమ్ జీ లాల్
89) ఈ క్రింద ఇవ్వబడిన కమిషన్లు, వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాలకు సంబంధించి మొదటి లిస్టును రెండవ లిస్టుకు జతపరుచుము. సరైన జవాబును కింద ఇవ్వబడిన కోడ్ ద్వారా సూచించుము.
లిస్ట్-I
లిస్ట్-II
a.సైమన్ కమిషన్
1.1946
b.క్యాబినెట్ మిషన్
2.1932
c.మూడవ రౌండ్ టేబుల్ సమావేశం
3.1927
d.క్రిప్స్ మిషన్
4.1942
A) a-1,b-2,c-3,d-4
B) a-3,b-1,c-2,d-4
C) a-3,b-2,c-4,d-1
D) a-4,b-1,c-2,d-3
90) సర్వీసు ట్యాక్స్ కి సంబంధించి కింది వాటిలో ఏది/ఏవి సరైనది/వి?
a.సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్ను విధిస్తుంది.
b.సర్వీసులపై పన్నును కేంద్ర ప్రభుత్వం మాత్రమే వసూలు చేసి అనుభవిస్తుంది.
c.ఇటువంటి పన్నును కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తాయి.
d.ఈ పన్ను వసూళ్లను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుభవిస్తాయి.
A) (a) మరియు (b) మాత్రమే సరైనవి
B) (b) మరియు (c) మాత్రమే సరైనవి.
C) (a),(c) మరియు (d) లు సరైనవి
D) (a),(b) మరియు (c) లు సరైనవి