101) భారత సుప్రీం కోర్టుకు సంబంధించి ఈ కింది వానిలో ఏ అంశాలు సరైనవి?
a.దీనికి భారతదేశంలోని ఏ కోర్టు లేదా ట్రిబ్యునల్ నుండి అయినా అప్పీలు స్వీకరించే అధికారం ఉంది.
b.రాష్ట్రపతి అడిగే ఏ వాస్తవ ప్రశ్న లేదా చట్టపరమైన అంశముల పైన అయినా సలహా పూర్వక అభిప్రాయాన్ని వెలిబుచ్చే అధికారం ఉంది.
c.న్యాయ సమీక్ష అధికారం కేవలం సుప్రీం కోర్టునకే గలదు.
d.భారత దేశంలోని అన్నీ ఇతర కోర్టులకు సుప్రీంకోర్టు న్యాయ పరిధి శిరోధార్యము.
కింద ఇచ్చిన కోడుల ద్వారా జవాబును ఎంచుకొనుము:
A) a & c
B) b & d
C) b,c & d
D) a,b & d
102) ఎన్నికల సంఘం
A) ఒక చట్టబద్దమైన సంస్థ
B) ఒక శాశ్వత కేంద్ర ప్రభుత్వ సంస్థ
C) ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థ
D) ఒక ప్రాతినిధ్య సంస్థ
103) క్రింద ఇచ్చిన కుతుబ్షాహీ సుల్తాన్లను వారి పాలనా కాలాన్ననుసరించి సరైన క్రమంలో తెలపండి.
a)మొహమ్మద్ కులీ కుతుబ్ షా
b)అబుల్ హసన్ తానీషా
c)ఇబ్రహీం కులీ కుతుబ్ షా
d)అబ్దుల్లా కుతుబ్ షా
A) b,a,c,d
B) c,d,b,a
C) c,a,d,b
D) d,c,b,a
104) దేవదాసి లేదా జోగినీగా మారే బాలిక వయస్సమూహం
A) 8-12 సం॥రాలు
B) 12-18 సం॥రాలు
C) 12-16 సం॥రాలు
D) 8-16 సం॥రాలు
105) రేచర్ల వెలమ కుటుంబ మూల పురుషుడెవరు?
A) సింగమ నాయకుడు
B) భేతాళ నాయకుడు
C) అనపోతా నాయకుడు
D) కుమార సింగమ నాయకుడు