121) క్రింది వానిలో సరైన జత ఏది?
A) సిమ్లా సమావేశం – 1945
B) క్యాబినెట్ మిషన్ ప్లాన్ – 1947
C) మౌంట్ బాటన్ ప్లాన్ – 1945
D) ఐ.ఎన్.ఎ.ట్రైల్స్ – 1947
122) ఎన్నికల సంఘం విధులకు సంబంధించి వీటిని పరిశీలించి, కింద ఇవ్వబడిన కోడుల ద్వారా జవాబును ఎంచుకొనుము.
a.ఎలెక్టోరల్ రోల్స్ ను రూపొందించడం
b.రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలు నిర్వహించడం
c.లోక్ సభ స్పీకరు, రాజ్య సభ డిప్యూటీ ఛైర్మను పదవులకు ఎన్నికలు నిర్వహించడం
d.పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు నిర్వహించడం
A) b,c,d సరైనవి a తప్పు
B) a,b,c సరైనవి d తప్పు
C) a,c,d సరైనవి b తప్పు
D) a,b,d సరైనవి c తప్పు
123) ‘రయ్యత్’ వార్తా పత్రిక ఏ భాషలో ప్రచురించబడింది?
A) తెలుగు
B) ఇంగ్లీష్
C) కన్నడ
D) ఉర్దూ
124) క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.
A) మొఘలుల కాలంలో జమీందారీ వ్యవస్థ ఉండేది.
B) లార్డ్ విలియం బెంటిక్ రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు.
A) A,B సరియైనవి
B) A సరియైనది కానీ B తప్పు
C) A తప్పు B సరియైనది
D) A,B లు రెండూ తప్పు
125) ఏదైనా రాష్ట్రానికి,ఆ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ఆస్తులను పరిరక్షించినందుకు కేంద్రం చెల్లించవలసిన మొత్తం విషయంలో వివాదం తలెత్తినపుడు, ఆ వివాద పరిష్కారానికి మధ్యవర్తిని ఎవరు నియమిస్తారు?
A) భారత రాష్ట్రపతి
B) భారత ప్రధాన మంత్రి
C) భారత ప్రధాన న్యాయమూర్తి
D) సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి