126) ఈ క్రింది అంశాలను కాలక్రమానుగుణంగా అమర్చండి.
A) రేణుకా రే అధ్యయన బృందం
B) కాకా కాలేల్ కర్ కమిషన్
C) ధేబర్ కమిషన్
D) మండల్ కమిషన్
కోడ్ లు:
A) A,B,D & C
B) B,A,D & C
C) A,C,B & D
D) B,A,C & D
127) లేమ్ – డక్ పార్లమెంటు సమావేశం అనగా:
A) లోక్ సభకు ఎన్నికలు జరిగిన తరువాత జరిగే మొదటి పార్లమెంటు సమావేశం
B) లోక్ సభ రద్దు అయ్యే ముందు జరిగే చివరి పార్లమెంటు సమావేశం.
C) అవిశ్వాస తీర్మానాన్ని చర్చించే పార్లమెంటు సమావేశం.
D) ‘ఏ బిల్లును కూడా ఆమోదించలేకపోయిన పార్లమెంటు సమావేశం.
128) క్రింద ఇచ్చిన ఢిల్లీ సుల్తాన్లను వారి పాలనా కాలాన్ని అనుసరించి సరైన క్రమంలో తెలుపండి.
a.ఇబ్రహీం లోడి
b.అల్లా ఉద్దీన్ ఖిల్జీ
c.ఇల్ టుట్ మిష్
d.ఫిరోజ్ తుగ్లక్
కోడ్ లు:
A) b,a,d,c
B) a,c,d,b
C) c,b,a,d
D) c,b,d,a
129) జాబితా -Aలో ఉన్న వాటిని జాబితా – B లోని వాటితో జతపరచి కింద ఇచ్చిన జవాబుల్లో సరైన దానిని ఎంచుకోండి.
జాబితా-A
జాబితా-B
a.ఆచార్య నాగార్జునుడు
1.వాకాటకులు
b.వైదిక మతాన్ని అణచివేసింది
2.విష్ణుకుండినులు
c.అజంతా గుహల చిత్రాలు
3.మాధరీపుత్ర వీరపురుషదత్తుడు
d.కీసరగుట్ట కోట
4.యజ్ఞశ్రీ శాతకర్ణి
A) a-2,b-1,c-3,d-4
B) a-4,b-3,c-1,d-2
C) a-3,b-4,c-2,d-1
D) a-1,b-2,c-4,d-3
130) బ్రిటిష్ పరిపాలనా కాలంలో గాంధీజీ మొదటి సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు?
A) చంపారన్
B) బొంబాయి
C) ఢిల్లీ
D) బర్దోలి