131) భారతదేశంలో బ్రిటీష్ వారు పొందిన తొలి వర్తక స్థావరం గల ప్రదేశం
A) కలకత్తా
B) మద్రాస్
C) మచిలీపట్నం
D) సూరత్
132) తన రాతల ద్వారా హైదరాబాద్ నగరంలోని కాచిగూడ నివాసిగా ఉండి, భారత యూనియన్ తో హైదరాబాద్ రాష్ట్ర విలీనోద్యమాన్ని బలపర్చినందుకు రజాకార్ల ద్వారా 22-08-1948 నాడు పాశవికంగా హత్య కావించబడిన పత్రికా రచయిత
A) షేక్ అలీ
B) సయ్యద్ అహ్మద్
C) షోయబుల్లా ఖాన్
D) మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్
133) కింద పేర్కొనిన ఏ తీర్పులో ఒక రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన పట్ల న్యాయ సమీక్ష జరుపవచ్చని మొట్టమొదటగా సుప్రీంకోర్టు పేర్కొన్నది?
A) స్టేట్ ఆఫ్ రాజస్థాన్ vs యూనియన్ ఆఫ్ ఇండియా (1977)
B) సుందర్ లాల్ పట్వా vs యూనియన్ ఆఫ్ ఇండియా (1993)
C) S.R. బొమ్మై vs యూనియన్ ఆఫ్ ఇండియా (1994)
D) రామేశ్వర్ ప్రసాద్ vs యూనియన్ ఆఫ్ ఇండియా (2006)
134) గిరిజనుల విశిష్ట, సాంస్కృతిక గుర్తింపు మరియు ఇతర వ్యవస్థల పరిరక్షణ కొరకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలకై చేపట్టిన ఆందోళన
A) ఛోటా నాగపూర్ ఆందోళన
B) గోండ్వానా ఉద్యమం & ముండా-ఓరాన్ సర్దార్ ఉద్యమం
C) ముండా-ఓరాన్ సర్దార్ ఉద్యమం
D) నక్సల్బరీ ఉద్యమం
135) ఈ క్రింది వాటిలో ఏది విజయనగర మరియు బహమనీ సుల్తానుల మధ్య ఘర్షణ ప్రాంతం?
A) కృష్ణా దోఆబ్ (అంతర్వేది)
B) తుంగభద్ర దోఆబ్ (అంతర్వేది)
C) రాయచూర్ దోఆబ్ (అంతర్వేది)
D) వేంగి దోఆబ్ (అంతర్వేది)