136) నిర్భయ చట్టం-
A) శిక్షాస్మృతి (సవరణ) చట్టం, 2013
B) మానభంగ నిరోధక చట్టం, 2011
C) లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2012
D) మహిళా హింస నిరోధక చట్టం, 2010
137) మన్సబ్ దారి విధానాన్ని ప్రవేశపెట్టింది?
A) బాబర్
B) అక్బర్
C) జహంగీర్
D) ఔరంగజేబ్
138) జాబితా-Aలో ఉన్న వాటిని జాబితా – Bలోని వాటితో జతపరచి కింద ఇచ్చిన జవాబుల్లో సరైన దానిని ఎంచుకోండి.
జాబితా-A
జాబితా-B
a.దుర్గాబాయ్ దేశముఖ్
1.హైదరాబాద్ రాజకీయ సభ
b.ఎం.వి.భాగ్యరెడ్డి వర్మ
2.ఆంధ్ర మహిళా సభ
c.కొండా వెంకట రంగారెడ్డి
3.ఆది హిందువులు
d.వై.ఎం.కాలే
4.ఆంధ్ర మహాసభ
A) a-3,b-1,c-2,d-4
B) a-4,b-2,c-1,d-3
C) a-2,b-3,c-4,d-1
D) a-1,b-3,c-2,d-4
139) రాష్ట్రపతి మరియు గవర్నర్ల క్షమాభిక్ష అధికారాలకు సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి?
a.మరణ శిక్ష విధించబడిన వాడిని రాష్ట్రపతి మాత్రమే క్షమించగలడు.
b.మరణ శిక్ష విధించబడిన వాడిని గవర్నర్ కూడా క్షమించవచ్చు.
c.మరణ శిక్ష విధించబడిన వాడిని గవర్నర్ క్షమించలేడు.
d.కోర్టు మార్షల్ ద్వారా శిక్షించబడిన వాడిని రాష్ట్రపతి మాత్రమే క్షమించగలడు.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది?
A) a & b
B) a,c, & d
C) a,b, & d
D) a,b & c
140) పంపిణీ న్యాయం అనే ఉద్దేశం రాజ్యాంగంలోని ఈ కింది అధికరణల ద్వారా పొందుపరచిన ఆదేశిక సూత్రాలలో ఉన్నది?
A) అధికరణం 39 (a) & (b)
B) అధికరణం 39 (b) & (c)
C) అధికరణం 39 (c) & (d)
D) అధికరణం 39 (e) & (f)