141) 1923లో హైదరాబాదు ప్రథమ రాజకీయ సమావేశం ఎక్కడ జరిగింది?
A) హైదరాబాద్
B) రాయచూర్
C) కాకినాడ
D) నాందేడ్
142) కింది వ్యాఖ్యలను గమనించండి.
a.మోటుపల్లి అభయ శాసనాన్ని రుద్ర దేవుడు వేయించాడు.
b.’పండితారాధ్య చరిత్ర’ గ్రంథాన్ని పాల్కుర్కి సోమనాథుడు రచించాడు.
c.’నృత్య రత్నావళి’ గ్రంథాన్ని బద్దెన రచించాడు.
d.బయ్యారం శాసనాన్ని కాకతి మైలాంబ వేయించింది
కింది జవాబుల్లో సరైన దాన్ని ఎంచుకోండి.
A) a & b
B) b & c
C) c & d
D) b & d
143) సుప్రీం కోర్టు ఇటీవలి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377 రాజ్యాంగ బద్ధతను పునర్ సమీక్ష చేసేందుకు దానిని అయిదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి పంపడానికి నిర్ణయించింది. ఇది ఏ అంశమునకు సంబంధించింది?
A) లెస్బియన్, గే, బై-సెక్యువల్, ట్రాన్స్-జెండర్ అంశాలు
B) భద్రాచలం మండలంలోని కొన్ని ప్రాంతాలకు తరిలించే విభజన అంశాలు
C) వైట్ కాలర్ నేరాలకు సంబంధించిన అంశాలు
D) జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి కేసు
144) స్వతంత్ర రాజుగా శివాజీ ఎక్కడ పట్టాభిషిక్తుడైనాడు?
A) రాయఘడ్
B) ఔరంగాబాద్
C) పూనే
D) నాగపూర్
145) తెలంగాణ భూస్వాములు గ్రామ సేవక కులాలపై దోపిడీని దీనితో పోలుస్తారు?
A) పాలేరు
B) వెట్టి
C) భిక్షం
D) జోగిని