26) క్రింది వాటిలో బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించని గ్రంథం ఏది?
A) నిదానక కథ
B) దీప వంశ
C) మహా వంశ
D) తేర గాథ
27) ఒక వ్యక్తి సమ్మతం లేకుండా చేసే నార్కో అనాలిసిస్ (సత్య శోధన) లాంటి పరీక్షలు రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఇవ్వబడిన ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తాయని సుప్రీంకోర్టు 2010 వ సంవత్సరంలో తీర్పు చెప్పింది?
A) 20(1)
B) 20(2)
C) 20(3)
D) 22
28) తెలంగాణలోని ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దమరవాయి, మల్లూరు, బొగత జలపాతాన్ని కలిపే ప్రాజెక్టు
A) గిరిజనాభివృద్ధి ప్రాజెక్టు
B) మౌళిక సదుపాయాభివృద్ధి ప్రాజెక్టు
C) గిరిజన పర్యాటక సర్క్యూట్ ప్రాజెక్టు
D) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టు
29) ఈ క్రింది దేవాలయాలలో ఏది బ్లాక్ పగోడాగా పిలువబడింది?
A) మహాబలిపురం
B) మామల్లాపురం
C) మహాదేవ దేవాలయం
D) సూర్య దేవాలయం
30) ప్రధానమంత్రితో కూడి మొత్తం మంత్రుల సంఖ్య మొత్తం లోక్ సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకుండా ఉండాలనే నిబంధనను తెచ్చిన రాజ్యాంగ సవరణ:
A) 42వ సవరణ చట్టం, 1976
B) 44వ సవరణ చట్టం, 1978
C) 91వ సవరణ చట్టం, 2003
D) 99వ సవరణ చట్టం, 2015