31) ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.
A) ఆర్ధిక ఉత్పత్తిలో కుటుంబం ఇప్పుడు ప్రధాన యూనిట్ కాదు.
B) ఇపుడు .కుటుంబ వ్యవస్థ చాలా వరకు తన సాంప్రదాయక ప్రకార్యాలను కోల్పోయింది.
A) A,B సరియైనవి
B) A సరైనది కానీ B తప్పు
C) A తప్పు B సరియైనది
D) A,B లు రెండూ తప్పు
32) 82 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 335 వ అధికరణాన్ని సవరిస్తూ ప్రభుత్వానికి కింది అధికారాన్ని ఇచ్చారు.
A) లోక్ సభలో ఆంగ్లో-ఇండియన్ ప్రజల ప్రాతినిధ్యం గురించి
B) ఏదైనా పోటీ పరీక్షలో కనీస అర్హత మార్కుల తగ్గింపు గురించి
C) లోక్ సభలో SC/ST లకు రిజర్వేషన్లు 70 సంవత్సరాల వరకు పెంచడం గురించి
D) దళిత క్రిస్టియన్లను షెడ్యూల్ తరగతుల జాబితాలో చేర్చడం గురించి
33) క్రింద ఇవ్వబడిన లిస్ట్-Iలో రాజ్యాంగ సవరణలను లిస్ట్-IIలోని సంబంధిత ప్రాథమిక హక్కులతో జతపరిచి సరైన జవాబును ఇవ్వండి.
లిస్ట్-A
లిస్ట్-B
a.మొదటి సవరణ
1.విద్యా హక్కు
b.86వ సవరణ
2.సంఘాలు ఏర్పాటు చేసే స్వేచ్ఛ
c.97వ సవరణ
3.SC & ST ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్
d.77వ సవరణ
4.వాక్ స్వేచ్ఛ
5.సమానత్వపు హక్కు
A) a-1,b-3,c-2,d-5
B) a-4,b-1,c-2,d-3
C) a-5,b-1,c-2,d-3
D) a-2,b-1,c-5,d-3
34) గ్రామీణ పోస్టాఫీసుల ద్వారా గ్రామీణ మహిళల్లో పొదుపు, సాధికారత పెంపొందించడం కొరకు ఉద్దేశించిన పథకం
A) రాష్ట్రీయ మహిళా కోశ్
B) జనధన పథకం
C) ఇందిరా మహిళా యోజన
D) మహిళా సమృద్ధి యోజన
35) 101వ రాజ్యాంగ సవరణ ద్వారా వస్తు మరియు సేవల పన్ను (GST)కు సంబంధించి ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడిన రాజ్యాంగ అధికరణం
A) 246-A
B) 289-A
C) 298-A
D) 242-A