36) లోక్ సభచే ఆమోదించబడిన రాజ్యాంగం (122వ సవరణ) బిల్లు, 2014, ఈ క్రింది వానిలో దేనిని ప్రవేశ పెట్టాలని ఉద్దేశించినది?
A) జాతీయ న్యాయ నియామకాల కమీషన్ (NJAC)
B) కొన్ని కులాలను షెడ్యూలు కులాల జాబితాలోనికి చేర్చడం
C) వస్తువులు, సేవల పన్ను (GST)
D) హైదరాబాదు కర్ణాటక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కర్నాటక గవర్నరుకు అధికారాలు ఇవ్వడం
37) తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల జనాభా అత్యధికంగా ఉన్న జిల్లా
A) నల్గొండ
B) కరీంనగర్
C) రంగారెడ్డి
D) మెదక్
38) ఒక వివాదంలో అన్ని రకాల న్యాయ ప్రక్రియలు ముగిసిన తర్వాత రెండవ సమీక్ష తరహాలో సుప్రీంకోర్టు ద్వారా ఆవిష్కరించబడిన ప్రక్రియ పేరు
A) స్పెషల్ లీవ్ పిటిషన్
B) క్యూరేటివ్ పిటిషన్
C) అసాధారణ పిటిషన్
D) జస్టిస్ పిటిషన్
39) సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం (Integrated Child Development Service Scheme) ఈ కింది సంవత్సరాల పిల్లల కొరకు ఉద్దేశించబడినది
A) 1-6 సంవత్సరాలు
B) 0-6 సంవత్సరాలు
C) 1-10 సంవత్సరాలు
D) 0-5 సంవత్సరాలు
40) సుబ్రహ్మణ్యం స్వామి vs యూనియన్ ఆఫ్ ఇండియా (2016) కేసులో సుప్రీం కోర్టు ఈ కింద పేర్కొనబడిన దానిని వాక్ మరియు భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడం లేదని తీర్పు చెప్పింది.
A) దేశ ద్రోహం
B) మత వ్యతిరేక భాష
C) అసభ్యత
D) క్రిమినల్ పరువు నష్టం