46) క్రింది పంచవర్ష ప్రణాళికలలో 1999-2000 సంవత్సరపు ధరలలో తలసరి ఆదాయ సాలుసరి సగటు వృద్ధి రేటు ఏ ప్రణాళికలో అత్యధికంగా ఉంది
A) 11వ ప్రణాళిక
B) 8వ ప్రణాళిక
C) 7వ ప్రణాళిక
D) 9వ ప్రణాళిక
47) కింది వాటిలో సుస్థిర అభివృద్ధి ప్రధాన లక్ష్యాలు ఏవి?
ఎ.అధిక యాంత్రీకరణ పద్ధతుల ద్వారా ఉత్పత్తిని చేపట్టడం
బి.దీర్ఘకాల అభివృద్ధి కోసం జీవ వైవిధ్యాన్ని రక్షించడం, ఆవరణ సంతులతను సాధించడం.
సి.పారిశ్రామిక అభివృద్ధి కోసం అధిక మొత్తాలలో సబ్సిడీలను ఇవ్వడం
డి.దారిద్ర్య రేఖకు కింద ఉన్న కుటుంబాల జీవన ప్రమాణ స్థాయిని పెంచడం, సమ్మిళిత వృద్ధిని సాధించడం.
A) ఎ మరియు బి మాత్రమే
B) సి మరియు డి మాత్రమే
C) ఎ మరియు సి మాత్రమే
D) బి మరియు డి మత్రమే
48) నీటి వినాశనం వల్ల జరిగే నష్టాన్ని తక్కువ అంచనా వేయలేం. బహుళార్థ సాధక ప్రాజెక్టుల సేద్యపు సంభావ్యత తగ్గుతూ ఉంది. అందుకు గల ప్రధాన కారణం (కింది వాటిలో) ఏది?
A) కొట్టుకొనిపోయి అడుగున పేరుకుపోయే బురద, ఒండ్రుమట్టి
B) వరదలు
C) భూసార వినాశనం
D) భూసార పునరుద్ధరణ
49) భూసేకరణ వంటి చట్టాల ప్రధాన సహేతుక వాదం ఏమిటి?
A) ప్రభుత్వం పూర్తి అధిపత్యం కలది కాబట్టి అవసరాన్ని బట్టి ఏ ముఖ్యమైన నిర్ణయాన్నైనా తీసుకోవచ్చు.
B) వ్యక్తి కంటే కమ్యూనిటీ ప్రయోజనాలు ప్రధానమైనవి
C) వ్యక్తులకు ఆస్తి హక్కు ఉండదు.
D) వ్యక్తులకు ఆస్తి హక్కు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి భూసేకరణపై సర్వాధికారాలు ఉన్నాయి.
50) క్రింది వాటిలో సుస్థిరమైన అభివృద్ధిని తెలిపేది ఏమిటి?
A) పర్యావరణాన్ని దెబ్బతీయని విధంగా దీర్ఘకాలిక అభివృద్ధి జరగడం
B) వృద్ధి దృష్ట్యా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం
C) డిమాండ్, సప్లయ్ శక్తుల ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం.
D) సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల వల్ల స్థూల దేశీయోత్పత్తి పెరగడం.