61) వెనుకబాటుతనానికి క్రింది వాటిలో ఏవి ప్రధాన కారణాలు?
i.చాలా తక్కువ తలసరి ఆదాయం
ii.మూలధన కొరత
iii.మానవ వనరుల, సహజ వనరుల అల్ప ఉపయోగిత
iv.సనాతన/సంప్రదాయ ఉత్పత్తి పద్ధతులు
A) (iii) మరియు (i) మాత్రమే
B) (i),(ii) మరియు (iv) మాత్రమే
C) (i),(ii),(iii) మరియు (iv)
D) (ii),(iii) మరియు (iv) మాత్రమే
62) బీదవారికి, అవసరమున్న వారికి సామాజిక సహాయక పథకాలు తోడ్పడతాయి అవి:
A) వ్యక్తులు ఇచ్చిన విరాళాలకు సంబంధించినవి
B) ప్రభుత్వ సాధారణ రెవెన్యూ నుంచి ఇచ్చినవి
C) ఉద్యోగులు, ఉద్యోగాధిపతులు, రాష్ట్రం ఇచ్చే విరాళాలకు సంబంధించినవి
D) ఉద్యోగులు, ఉద్యోగాధిపతులు ఇచ్చే విరాళాలకు సంబంధించినవి.
63) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన కింది వ్యాఖ్యలను గమనించండి :
ఎ.ఒక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కల్పించాలి.
బి.మహిళ, పురుష కూలీలకు సమాన వేతన రేటును చెల్లించాలి.
సి.ఈ పథక లబ్ధిదారుల్లో మూడవ వంతు కూలీలు స్త్రీలై ఉండాలి.
డి.దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న ప్రజలకు మాత్రమే ఉపాధిని కల్పించాలి.
పై వ్యాఖ్యలలో ఈ చట్టానికి సంబంధించి ఏవి సరైనవి?
A) ఎ, బి మరియు సి
B) బి, సి మరియు డి
C) సి, డి మరియు ఎ
D) డి, ఎ మరియు బి
64) ఖనిజాలు, కలప, చేపలు, నీరు వంటి ముడి/భౌతిక వనరులు కింది వాటిలో ఏ తరగతికి చెందినవి?
A) నిబంధనల వర్గం & నియంత్రణ వర్గం
B) నియంత్రణ వర్గం
C) సాంస్కృతిక వర్గం
D) ఆహ్లాదక వర్గం
65) భారతదేశంలో భూసారం వినాశనం జరగకుండా ఉండేందుకు తీసుకోవలసిన ప్రధాన చర్య ఏమిటి?
A) నీటిని ఉచితంగా, అటవీ నిరంతరంగా వినియోగించడానికి అనుమతినివ్వడం
B) కొండ ప్రాంతాల్లో అటవీ విస్తరణ, పచ్చిక మైదానాల అభివృద్ధి పథకాల అమలు
C) వ్యవసాయంలో అధిక ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం
D) భూమిలోని నీటి వాడకాన్ని నిరుత్సాహపరచడం