66) ఒక దేశంలో శిశు జనాభా వృద్ధి రేటు కంటే పనిచేసే వయస్సు గల జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంటే అది దేనికి దారి తీస్తుంది?
A) అధిక ఆధారిత నిష్పత్తి
B) మధ్యస్థ ఆధారిత నిష్పత్తి
C) అల్ప ఆధారిత నిష్పత్తి
D) అనాధారిత నిష్పత్తి
67) తెలంగాణ రాష్ట్రంలోని కింది ఏ జిల్లాలో అత్యధిక పరిశ్రమలు గలవు?
A) హైదరాబాద్
B) రంగారెడ్డి
C) మెదక్
D) నల్గొండ
68) క్రింది వాటిలో ‘హిందూ వృద్ధి రేటు’ కు సంబంధించినది ఏవి?
ఎ.వ్యవసాయ వృద్ధి రేటు
బి.స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు
సి.సగటున సాలీనా వృద్ధి రేటు సుమారు 3.5 శాతంను సాధించడం
డి.స్థూల మూలధన కల్పన వృద్ధి రేటు
A) ఎ మరియు బి మాత్రమే
B) బి మరియు సి మాత్రమే
C) సి మరియు డి మాత్రమే
D) డి మరియు ఎ మాత్రమే
69) అబివృద్ధి చెందుతున్న దేశాలలో ఆదాయ స్థాయి తక్కువగా ఉంటే వినియోగ ప్రవృత్తి అధికంగా ఉంటుంది. దాని పర్యవసానంగా మూలధన కల్పన ఏ విధంగా ఉంటుంది?
A) చాలా అధికం
B) నామమాత్రంగా అధికం
C) అల్పం
D) స్థిరం
70) క్రింది స్థాయి వరకు ప్రభావం ప్రధానంగా తెలియజేసేది ఏమిటి
A) ఆర్థికవృద్ధి వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు చివరికి పేదలందరికి అందడం & ఆర్థికవృద్ధి ప్రయోజనాలు సమాజం మొత్తానికి అందించడం.
B) ఆర్థికవృద్ధిని ప్రభుత్వం నియంత్రించడం.
C) ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు గ్రామీణ పేదలకు చేరడానికి డెలివరీ సిస్టం అవసరం ఉంది.
D) ఆర్థికవృద్ధి ప్రయోజనాలు సమాజం మొత్తానికి అందించడం.