71) భారతదేశంలో గత కొన్ని దశాబ్దాల్లో
ఎ.జనన రేటు పెరుగుతుంది
బి.మరణ రేటు తగ్గుతుంది
సి.జనన రేటు తగ్గుతుంది
డి.మరణ రేటు తగ్గుతుంది
ఈ క్రింది వాటిలో ఏది/ఏవి నిజం?
A) ఎ మరియు బి
B) బి మరియు సి
C) సి మరియు డి
D) ఎ మరియు డి
72) క్రింది అర్థశాస్త్రవేత్తలలో ఎవరు అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం మొదటగా నిరంతర ప్రణాళికను బలపరిచారు?
A) అమర్త్యసేన్
B) గున్నార్ మిర్థాల్
C) పి.సి. మహలనోబిస్
D) పి.ఆర్. బ్రహ్మానంద
73) భారత స్వాతంత్య్రానంతరం భూసంస్కరణలపై సూచనలకు గాను మొదటి కమిటీని వేశారు. ఆ కమిటీని ఏమంటారు?
A) పి.సి. జోషి కమిటీ
B) జె.సి. కుమారప్ప కమిటీ
C) బందోపాధ్యాయ కమిటీ
D) మొరార్జీ దేశాయి కమిటీ
74) క్రింది వ్యాఖ్యలను గమనించండి:
ఎ.భారతదేశంలో ఎన్నో ఫెర్రో-అలాయ్ లోహాలు విరివిగా లభిస్తాయి
బి.మాంగనీస్, క్రోమైట్ తప్ప ఇతర ఫెర్రో-అలాయ్ లోహాలు భారతదేశంలో విరివిగా లభించవు
సి.రాగి అనేది హరింపచేయని లోహం
డి.భారతదేశంలో ఫెర్రో-అలాయ్ లోహాలు లభించవు.
A) ఎ & డి మాత్రమే
B) .ఎ & బి మాత్రమే
C) సి & డి మాత్రమే
D) బి & సి మాత్రమే
75) పట్టికలో ఇచ్చిన దత్తాంశం ఆధారంగా ప్రశ్నలకు జవాబులిమ్ము.
పట్టిక: కొన్ని తెలంగాణ జిల్లాల్లోని భూకమతాల వివరాలు (శాతాలలో)
జిల్లా
నామమాత్రపు
చిన్న స్థాయి
ఒక మోస్తరు
మధ్య స్థాయి
పెద్ద స్థాయి
ఆదిలాబాద్
49.8
27.7
17.5
4.6
0.4
నిజామాబాద్
67.5
23.8
7.3
1.3
0.1
మెదక్
67.9
21.7
7.8
2.3
0.3
వరంగల్
67.1
21.4
8.7
2.5
0.3
A) ఆదిలాబాద్
B) మెదక్
C) నిజామాబాద్
D) వరంగల్