76) మానవ అభివృద్ధి సూచికను కొలవడానికి తలసరి స్థూల దేశీయోత్పత్తిని, విద్యారంగంలోని ఉమ్మడి స్థూల విద్యార్థుల నమోదును తీసుకుంటూ కింద వాటిలో దేనిని లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
A) జనాభా రేటు
B) శిశు మరణాల రేటు
C) తలసరి ఆహార వినియోగం
D) సగటు ఆయుర్దాయం
77) 1946లో హైదరాబాద్ రాష్ట్రంలో చేయబడిన గిరిజన ప్రాంతాల క్రమబద్దీకరణ ఫస్లీ 1356 చట్టం ద్వారా అన్ని గిరిజన భూముల తగాదాలను ఎవరికి అప్పగించింది?
A) గిరిజన కమిటీలు
B) గిరిజన కమ్యూనిటీలు
C) గిరిజన పంచాయితీలు
D) గిరిజన కమిషన్
78) తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం 2016 (తెలంగాణ ప్రభుత్వం) ప్రకారం 2011-12 ధరలలో తలసరి ఆదాయం ఆధారంగా 2013-14 (రెండవ పునఃఅంచనాలు) లో తెలంగాణ ప్రాంతంలో కింది వాటిలో అతి పేదరిక జిల్లా ఏది?
A) మెదక్
B) మహబూబ్ నగర్
C) ఆదిలాబాద్
D) వరంగల్
79) భారతదేశంలో 60 శాతం వలసలు ఏ స్థాయిలో జరిగాయి?
A) అంతర్ రాష్ట్ర వలసలు
B) అంతర్ జిల్లా వలసలు
C) అంతర్ నగర వలసలు
D) అంతర్ ప్రాంతీయ వలసలు
80) అన్ని అభివృద్ధి ప్రయాత్నాలలో మానవ అభివృద్ధిని కీలకంగా భావించి కింది వాటిలో ఏ ప్రణాళిక మానవ అభివృద్ధి లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించింది?
A) 5వ పంచవర్ష ప్రణాళిక
B) 6వ పంచవర్ష ప్రణాళిక
C) 7వ పంచవర్ష ప్రణాళిక
D) 8వ పంచవర్ష ప్రణాళిక