81) క్రింది వాటిలో వేటిని క్రమంగా తగ్గిస్తూ, అంతిమంగా నిర్మూలించాలనే ఆధారంగా ఆర్థికాభివృద్ధి ఆశయాలను సాధించవచ్చు?
ఎ.పేదరికం, నిరుద్యోగిత, అసమానతలు
బి.జనాభా, మానవ అభివృద్ధి, సామాజిక అవస్థాపన
సి.మాల్ న్యూట్రీషన్, రోగాలు, నిరక్షరాస్యత
డి.వ్యవసాయం, ఉద్యోగిత, అక్షరాస్యత
A) డి మరియు సి
B) ఎ మరియు బి
C) సి మరియు ఎ
D) బి మరియు డి
82) 1949 లో భారత ప్రభుత్వంచే స్థాపించబడిన ‘జాతీయాదాయ కమిటీ’ . లో కింది వారిలో సభ్యులు ఎవరు?
ఎ.ఆచార్య పి.సి. మహలనోబిస్
బి.ఆచార్య డి. ఆర్. గాద్గిల్
సి.డా॥బి.ఆర్. అంబేద్కర్
డి.ఆచార్య వి.కె. ఆర్. వి. రావు
A) ఎ, బి మరియు సి
B) బి, సి మరియు డి
C) సి, డి మరియు ఎ
D) డి, ఎ మరియు బి
83) ఈ క్రింది ఏ రకమైన పన్నులలో ఆదాయం పెరిగినప్పుడు పన్నురేటు పెరుగుతుంది?
ఎ.నైష్పత్తిక పన్ను
బి.పురోగామి పన్ను
సి.తిరోగామి పన్ను
డి.అధిక పురోగామి పన్ను
A) ఎ మరియు బి
B) బి మరియు సి
C) సి మరియు డి
D) బి మరియు డి
84) భూమి విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలో భారతదేశ స్థానం ఎంత?
A) 4వ
B) 5వ
C) 6వ
D) 7వ
85) కౌలుదారీ చట్టం ప్రకారం తెలంగాణ ప్రాంతంలో 1948 కంటే ముందు వరుసగా ఆరు సంవత్సరాలు భూమిని సాగుచేసే వ్యక్తిని ఏమంటారు?
A) భూమిశిస్తును చెల్లించువాడు
B) మౌఖిక కౌలుదారు
C) రక్షణ పొందిన కౌలుదారు
D) సాధారణ కౌలుదారు