86) శిశు లింగ నిష్పత్తిని కింది వాటిలో దేని ప్రకారం నిర్వహిరచవచ్చు?
A) శూన్యం నుంచి 4 ఏళ్ళ వయస్సు గ్రూప్ గల ప్రతి వెయ్యిమంది బాలికలకు అదే వయస్సు గ్రూప్ లో ఉండే బాలుర సంఖ్య
B) శూన్యం నుంచి 6 ఏళ్ళ వయస్సు గ్రూప్ గల ప్రతి వెయ్యిమంది బాలికలకు అదే వయస్సు గ్రూప్ లో ఉండే బాలురు సంఖ్య
C) శూన్యం నుంచి 4 ఏళ్ళ వయస్సు గ్రూప్ గల ప్రతి వెయ్యిమంది బాలురకు అదే వయస్సు గ్రూప్ లో ఉండే బాలికల సంఖ్య
D) శూన్యం నుంచి 6 ఏళ్ళ వయస్సు గ్రూప్ గల ప్రతి వెయ్యిమంది బాలురకు అదే వయస్సు గ్రూప్ లో ఉండే బాలికల సంఖ్య
87) క్రింది వాటిలో జాతీయాదాయాన్ని రాబట్టడానికి కలపవలసిన అంశాలు ఏవి?
ఎ.అన్ని బదలీ చెల్లింపులను కలపడం
బి.ఉత్పత్తి చేసిన అన్ని వస్తుసేవల విలువలను కలపడం
సి.అన్ని ఉత్పత్తి కారకాలకు చేసే అన్ని చెల్లింపులను కలపడం
డి.సృష్టించబడిన అన్ని ఆదాయాలను కలపడం
A) ఎ, బి మరియు సి
B) బి, సి మరియు డి
C) సి, డి మరియు ఎ
D) డి, ఎ మరియు బి
88) గత రెండు దశాబ్దాల కాలంలో తెలంగాణలో కింది వాటిలో ఏ ఆహారేతర పంటలు అధికంగా/వేగవంతంగా పండించబడ్డాయి ?
ఎ.పసుపు
బి.పత్తి
సి.చెరకు
డి.మొక్కజొన్న
A) ఎ మరియు సి
B) బి మరియు డి
C) ఎ మరియు బి
D) సి మరియు డి
89) ‘హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టం, 1950′ ప్రకారం చల్కా నేల గల కుష్కి భూమికి తెలంగాణలో కౌలుదారు చెల్లించాల్సిన అత్యధిక అద్దెను ఎంత నిర్ణయించారు?
A) భూ ఆదాయానికి రెండింతలు
B) భూ ఆదాయానికి మూడింతలు
C) భూ ఆదాయానికి నాల్గింతలు
D) భూ ఆదాయానికి ఐదింతలు
90) భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పాదకత విషయంలో ప్రస్తుత పరిస్థితి ఏమి తెలుపుతుంది?
A) భవిష్యత్ ఆహార డిమాండ్ కు సరిపోయేంతగా ఉత్పత్తి ఉంటుంది.
B) భవిష్యత్ అవసరాలకు మించి ఉత్పత్తి జరుగుతుంది
C) భవిష్యత్ అవసరాలకు సరిపోయేంత ఉత్పత్తి జరగదు.
D) అంచనా వేయలేం