91) జలాశయాలు, చెరువులు పూడిక మట్టితో నిండిపోతున్నాయి. దీనివల్ల ప్రభావితం అయ్యేవి ఏమిటి?
A) కొండ ప్రాంతాలు/గుట్టల భూమి
B) సాగువంతం/సేద్యంకాని, పనికిరాని భూమి
C) వర్షజలంకూడే నదీ ప్రాంతాలలో అడవుల విస్తరణ
D) సముద్రాలు
92) ‘నీతి ఆయోగ్’ అను పదంలో నీతి (యన్ ఐటిఐ) అంటే ఏమిటి?
A) నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూషన్
B) నేషనల్ ఇన్ స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా
C) నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియా
D) నేషనల్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా
93) క్రింది వాటిలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఏది అత్యవసర లక్షణంగా ఉంటుంది?
A) మూలధన వస్తువులు, వినియోగ వస్తువుల కలిసి ఉండడం
B) శ్రమసాంద్రత, మూలధనసాంద్రత పద్ధతులు కలిసి అమలులో ఉండడం.
C) పట్టణ, సెమీ- పట్టణ ప్రాంతాలు కలిసి ఉండడం.
D) ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేయడం.
94) ఆర్థిక అభివృద్ధిని సూచించేది ఏమిటి?
A) పరిమాణాత్మక మార్పులు మాత్రమే
B) గుణాత్మక మార్పులు మాత్రమే
C) సాంకేతిక మార్పులు మాత్రమే
D) పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు
95) క్రింది వ్యాఖ్యలను గమనించండి
ఎ.ఒక యూనిట్ ఉత్పాదితాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే మూలధన యూనిట్ల సంఖ్యను మూలధన – ఉత్పత్తి నిష్పత్తి తెలియజేస్తుంది.
బి.ఒక సమయంలో వివిధ రంగాల మూలధన ఉత్పాదకతను మూలధన – ఉత్పత్తి నిష్పత్తి తెలుపుతుంది.
సి.జాతీయ పొదుపు నిష్పత్తితో పాటు మూలధన – ఉత్పత్తి నిష్పత్తి జాతీయాదాయ వృద్ధి రేటును నిర్ణయిస్తుంది.
డి.మూలధన – ఉత్పత్తి నిష్పత్తితో స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు అనుపాత సంబంధాన్ని కలిగి ఉంటుంది.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
A) ఎ, బి మరియు సి
B) బి, సి మరియు డి
C) సి, డి మరియు ఎ
D) బి, ఎ మరియు డి