6) క్రింది జతలను గమనించండి.
ప్రణాళిక —— కాలం
ఎ.రెండవ పంచవర్ష ప్రణాళిక – 1956 – 1961
బి.మూడవ పంచవర్ష ప్రణాళిక – 1961 – 1966
సి.నాల్గవ పంచవర్ష ప్రణాళిక – 1966 – 1971
డి.మొదటి పంచవర్ష ప్రణాళిక – 1951 – 1956
పై జతలలో ఏవి సమ ఉజ్జిగా (సరిపోయినవిగా) ఉన్నాయి?
A) ఎ,బి మరియు సి
B) బి, సి మరియు డి
C) సి, డి మరియు ఎ
D) డి, ఎ మరియు బి
7) భూసేకరణ చట్టానికి సంబంధించి భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (CAG) ఇటీవల ఆడిట్ నివేదికలో కింది వాటిలో వేటికి సంబంధించి అనేక క్రమాలను బయట పెట్టారు?
ఎ.భూకేటాయింపులు
బి.భూవినియోగం
సి.భూ సేకరణ వల్ల ప్రభావితమైన ప్రజల సెటిల్ మెంట్
డి.ప్రభావిత ప్రజల నష్ట పరిహారం, పునరావాసం
A) ఎ, సి మరియు డి మాత్రమే
B) ఎ, బి మరియు సి మాత్రమే
C) ఎ మరియు బి మాత్రమే
D) ఎ, బి, సి మరియు డి
8) తెలంగాణలో కింది వాటిలో ఏ జిల్లాల గుండా కృష్ణానదీ పరివాహక ప్రాంతం వెళ్తుంది?
A) మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్
B) ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ
C) కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్
D) వరంగల్, మహబూబ్ నగర్, హైదరాబాద్
9) జి.ఓ.ఎం.ఎస్ నెం. 971, రెవెన్యూ డిపార్ట్ మెంట్, తేదీ 7-10-1969లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గిరిజనేతరులనకు కేటాయించడాన్ని, బదిలీ చేయడాన్ని నిషేధించింది?
A) రిజర్వుడ్ అడవులు
B) షెడ్యూల్డ్ ప్రాంతాలు
C) షెడ్యూల్డ్ కాని ప్రాంతాలు
D) పర్వత ప్రాంతాలు
10) క్రింది వాటిలో సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏది?
A) దారిద్య్ర రేఖ
B) లారెంజ్ రేఖ
C) ఉదాసీనతా రేఖ
D) గిఫెన్ వైపరీత్యం