101) ఒక వ్యక్తి యొక్క ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉండే పరిస్థితిని లేదా ఒక పనిలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసే స్థితిని ఏమంటారు ?
A) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
B) సంఘృష్ట (ఘర్షణ) నిరుద్యోగిత
C) బహిరంగ నిరుద్యోగిత
D) రుతుపరమైన నిరుద్యోగిత
102) క్రింది వాటిలో ఆర్థిక ప్రణాళికీకరణ లక్షణంగా ఏ ఆర్థిక వ్యవస్థ గుర్తించబడుతుంది?
A) పరిమిత (క్లోజ్ డ్ ) ఆర్ధిక వ్యవస్థ
B) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
C) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
D) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
103) అమలులో ఉన్న వేతన రేటు దగ్గర పని చేయాలనే కోరికతోపాటు శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు లభ్యం కావడాన్ని (కింది వాటిలో) ఏమంటారు?
A) స్వయం – ఉపాధి
B) పునరు ద్యోగిత
C) సంపూర్ణోద్యోగిత
D) అనుద్యోగిత
104) క్రింది వ్యాఖ్యలను గమనించండి :
ఎ.జనాభాలో ఆర్థిక వృద్ధి కొద్ది భాగానికి మాత్రమే పరిమితం
బి.మూలధనం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల మధ్య అసమానతలు నామమాత్రంగా ఉండవచ్చు
సి.అభివృద్ధి చెందిన, చెందని దేశాల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగాయి
డి.అభివృద్ధి చెందని దేశాలలో పేదరికం అధికంగా ఉంటుంది.
పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
A) ఎ, బి మరియు సి
B) బి, సి మరియు డి
C) సి, డి మరియు ఎ
D) డి, ఎ మరియు బి.
105) భారతదేశానికి, రాష్ట్రాలకు సంబంధించి ప్రధానమైన గణాంకాలకు ఆధారమైన ‘వార్షిక పారిశ్రామిక సర్వే’ కింది వాటిలో దేనికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది?
A) వ్యవస్థీకృత తయారీ రంగం
B) అవ్యవస్థీకృత తయారీ రంగం
C) నిర్దిష్టం కాని తయారీరంగం
D) వ్యవస్థీకృత పారిశ్రామిక రంగం