111) రాగ్నార్ నర్క్స్ ప్రకారం వెనుకబడిన చాలా దేశాలు కింది వాటిలో ఏ ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నాయి?
A) పేదరిక విషవలయాలు
B) అధిక డిమాండ్
C) ఉత్పాదక పెట్టుబడి
D) ద్వితీయ రంగ ఉత్పత్తుల ఎగుమతి
112) 2011 సెన్సెస్ ప్రకారం మెగాసిటీలలో జనాభా వృద్ధి ఏవిధంగా మార్పు చెందింది?
A) తగ్గింది
B) పెరిగింది
C) నిలకడగా ఉంది
D) సంచలన అభివృద్ధి జరిగింది
113) వెనుకబడిన దేశాలలో నిరుద్యోగిత కింది రకాలలో దేనిగా ఉంటుంది?
A) పట్టణ నిరుద్యోగిత
B) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
C) బహిరంగ నిరుద్యోగిత
D) విద్యాయుత నిరుద్యోగిత
114) ఐదవ పంచవర్ష ప్రణాళిక సాధించదలచిన ప్రధాన ఉద్దేశాలు ఏవి?
A) స్థిరత్వం, వృద్ధి
B) సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వం
C) సమ్మిళిత వృద్ధి, జీవన ప్రమాణాలు పెంపు
D) పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి సాధన
115) ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి కింది వాటిలో ఎటువంటి చర్యలను చేపట్టాలి?
ఎ.వెనుకబడిన ప్రాంతాలలో అందరికీ సబ్సిడీలను కల్పించాలి.
బి.వెనుకబడిన ప్రాంతాలలో అవస్థాపనా సౌకర్యాలను అభివృద్ధి చేయాలి.
సి.పెద్ద పారిశ్రామిక సంస్థలకు సబ్సిడీలను కల్పించాలి.
డి.వెనుకబడిన ప్రాంతాల పేద ప్రజలకు కనీస జీవనాధార స్థాయికి చేరుకోవడానికి ఆసరా కల్పించాలి.
A) ఎ మరియు బి మాత్రమే
B) ఎ మరియు డి మాత్రమే
C) బి మరియు డి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే