116) క్రింది వాటిలో ఏ ప్రణాళికా కాలంలో సగటున అత్యధికంగా 8 శాతానికి పైగా వృద్ధిరేటును సాధించడం జరిగింది?
A) 7వ పంచవర్ష ప్రణాళికా
B) 8వ పంచవర్ష ప్రణాళిక
C) 10వ పంచవర్ష ప్రణాళికా
D) 11వ పంచవర్ష ప్రణాళిక
117) ‘జాతీయ ఆహార భద్రతా చట్టం 2013’ కింద ఏ ప్రభుత్వ కార్యక్రమాలు/పథకాలు వర్తింపచేయబడతాయి?
ఎ.మధ్యాహ్న భోజన పథకం
బి.సమీకృత బాలల అభివృద్ధి పథకం
సి.ప్రజా పంపిణీ వ్యవస్థ
డి.బఫర్ స్టాక్ మేనేజ్ మెంట్
A) ఎ, బి మరియు సి
B) బి, సి మరియు డి
C) సి, డి మరియు ఎ
D) డి, ఎ, మరియు బి
118) ప్రణాళికా సంఘానికి ఎక్స్-అఫిషియో ఛైర్ పర్సన్ (అధ్యక్షులు) ఎవరు?
A) కేంద్రఆర్థిక మంత్రి
B) ప్రధాన మంత్రి
C) లోక్ సభ స్పీకర్
D) రిజర్వు బ్యాంకు గవర్నర్
119) తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతి, సొంత ధృవీకరణ విధానం (TS-iPASS), బిల్లు 2015 రాష్ట్రంలో ఎన్ని పని దినాలలో శీఘ్రంగా పారిశ్రామిక అనుమతులు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది?
A) 12 రోజులు
B) 7 రోజులు
C) 10 రోజులు
D) 15 రోజులు
120) 2014 లో సింగరేణి బొగ్గు గనుల్లో మూడింట రెండు వంతుల బొగ్గు గనులు ఎలా నిర్వహింపబడ్డాయి?
A) బహిరంగ (open cast) గనుల త్రవ్వకం
B) అంతర్భాగ (underground) గనుల త్రవ్వకం
C) లోతైన సొరంగపు గనుల త్రవ్వకం
D) ట్రాకింగ్ ప్రక్రియ