121) 2011 సెన్సెస్ దత్తాంశం ప్రకారం, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం లేని భారత కుటుంబాలు ఎంత శాతం ఉన్నాయి?
A) 46%
B) 54%
C) 35%
D) 60%
122) జాతీయాదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే ఏమి పొందగలం?
A) తలసరి ఆదాయ వృద్ధి రేటు
B) వాస్తవిక ఆదాయ వృద్ధి రేటు
C) వ్యయార్హ ఆదాయ వృద్ధి రేటు
D) నికర జాతీయోత్పత్తి వృద్ధి రేటు
123) ఆస్తుల సేకరణ, ఉద్దేశ పూర్వక తాత్కాలిక సేకరణ కింది వాటిలో ఏ జాబితా కిందికి వస్తాయి?
A) కేంద్ర జాబితా
B) రాష్ట్ర జాబితా
C) ఉమ్మడి జాబితా
D) ప్రైవేట్ జాబితా
124) పట్టికలో ఇచ్చిన దత్తాంశం ఆధారంగా ప్రశ్నలకు జవాబులిమ్ము.
పట్టిక: కొన్ని తెలంగాణ జిల్లాల్లోని భూకమతాల వివరాలు (శాతాలలో)
జిల్లా
నామమాత్రపు
చిన్న స్థాయి
ఒక మోస్తరు
మధ్య స్థాయి
పెద్ద స్థాయి
ఆదిలాబాద్
49.8
27.7
17.5
4.6
0.4
నిజామాబాద్
67.5
23.8
7.3
1.3
0.1
మెదక్
67.9
21.7
7.8
2.3
0.3
వరంగల్
67.1
21.4
8.7
2.5
0.3
A) భూకమతాల విస్తీర్ణంలో మధ్య స్థాయి కమతాల వాటా అత్యల్పంగా ఉంది
B) పెద్ద స్థాయి కమతాల వాటా అత్యల్పంగా ఉంది.
C) నామమాత్రపు (marginal) కమతాల వాటా అత్యల్పంగా ఉంది.
D) ఒక మోస్తరు (semi-medium) కమతాల వాటా అత్యల్పంగా ఉంది.
125) 1951లో భారతదేశంలో పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఏ అనుపాతంలో ఉన్నారు?
A) ప్రతిముగ్గురు వ్యక్తులలో ఒకరు
B) ప్రతి నలుగురు వ్యక్తులలో ఒకరు
C) ప్రతి ఐదుగురు వ్యక్తులలో ఒకరు
D) ప్రతి ఆరుగురు వ్యక్తులలో ఒకరు.