126) తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వనరులలో చెరువుల వాటా ‘తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం 2016’ (తెలంగాణ ప్రభుత్వం) ప్రకారం 2014-15లో ఎంత ఉంది ?
A) 15.76%
B) 12.67%
C) 10.05%
D) 5.62%
127) కాలం గడిచిన కొద్దీ గృహ రంగం, ఎనర్జీ రంగం, పారిశ్రామిక రంగం వంటి సేద్యేతర రంగాల నుంచి నీటి డిమాండ్ ఏ విధంగా ఉంది?
A) చాలా తగ్గే అవకాశం ఉంది.
B) చాలా పెరిగే అవకాశం ఉంది.
C) ఒక మోస్తరుగా పెరిగే అవకాశం ఉంది.
D) ఒక మోస్తరుగా తగ్గే అవకాశం ఉంది.
128) 1901 నుంచి 1991 వరకు సెన్సెస్ దత్తాంశం కింది వాటిలో ఏమి సూచిస్తుంది?
A) స్త్రీ – పురుష నిష్పత్తి క్రమంగా పెరిగింది
B) స్త్రీ – పురుష నిష్పత్తిలో ఎగుడు దిగుడులు.
C) స్త్రీ – పురుష నిష్పత్తి క్రమంగా తగ్గింది.
D) ఒక నిర్దిష్ట ధోరణి అంటూ లేదు.
129) 15 నుంచి 20 లేదా 25 సంవత్సరాల కాలపరిమితిలో సాధించవలసిన లక్ష్యాలను నిర్ణయించుకుని, ప్రణాళికలో సాధించవలసిన లక్ష్యాలను నిర్ణయించుకుని, ప్రణాళికలో కొనసాగింపు (Continuity) ఉండేటట్లు చేసే ప్రణాళికను ఏమంటారు?
A) కేంద్రీకృత ప్రణాళిక
B) ప్రజాస్వామిక ప్రణాళిక
C) అధీకృత ప్రణాళిక
D) దీర్ఘదర్శి ప్రణాళిక
130) ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ప్రాంతం) కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టం, 1950 ప్రకారం రక్షణ పొందిన కౌలుదారీ అన్ని హక్కులు ఎవరికి వర్తిస్తాయి?
A) చట్టరీత్యా వారసులకు చెందేవి
B) చట్టరీత్యా వారసులకు చెందవు
C) పున:పరిశీలనకు అర్హమైనవి
D) రిజర్వు చేయబడినవి.