1806 total views , 15 views today
131) వ్యవసాయ వస్తువులను ఉత్పత్తి చేసి, మార్కెట్ లో అమ్మడానికి వ్యవసాయ దారునికి, ఒక సంస్థకు మధ్య జరిగే వ్యవస్థీకృత ఏర్పాటును ఏమంటారు?
A) వాణిజ్య వ్యవసాయం
B) ఒప్పంద వ్యవసాయం
C) సన్నకారు వ్యవసాయం
D) సహకార వ్యవసాయం
132) పట్టికలో ఇచ్చిన దత్తాంశం ఆధారంగా ప్రశ్నలకు జవాబులిమ్ము.
పట్టిక: కొన్ని తెలంగాణ జిల్లాల్లోని భూకమతాల వివరాలు (శాతాలలో)
జిల్లా | నామమాత్రపు | చిన్న స్థాయి | ఒక మోస్తరు | మధ్య స్థాయి | పెద్ద స్థాయి |
ఆదిలాబాద్ | 49.8 | 27.7 | 17.5 | 4.6 | 0.4 |
నిజామాబాద్ | 67.5 | 23.8 | 7.3 | 1.3 | 0.1 |
మెదక్ | 67.9 | 21.7 | 7.8 | 2.3 | 0.3 |
వరంగల్ | 67.1 | 21.4 | 8.7 | 2.5 | 0.3 |
A) వరంగల్
B) మెదక్
C) నిజామాబాద్
D) ఆదిలాబాద్
133) తెలంగాణలోనూ, ఇతర ప్రాంతాలలోనూ వ్యవసాయదారులు బీటి పత్తి విత్తనాలను విస్తారంగా వాడారు. ఎందుకంటే వారి దృష్టిలో బీటి పత్తి విత్తనాలు
A) జీవ వైవిధ్యాన్ని పెంచుతాయి
B) నేలను సారవంతం చేస్తాయి
C) తక్కువ ధరగలవి
D) ఉత్పత్తి వ్యయాలను తగ్గిస్తాయి.
134) 2003-04 నుంచి 2013-14 వరకు తెలంగాణ ప్రాంతంలోని కింది వాటిలో ఏ జిల్లాలో సూక్ష్మ సేద్యం పద్ధతి ద్వారా అత్యధిక విస్తీర్ణంలో సాగుచేయబడింది ?
A) నిజామాబాద్
B) మహబూబ్ నగర్
C) నల్గొండ
D) మెదక్
135) పని చేయడానికి ఇష్టపడి, పనికోసం ప్రయత్నం చేసి సంవత్సరంలో అధిక కాలం ఖాళీగా ఉండే వ్యక్తిని ఏమంటారు?
A) వారపరమైన స్థితి గల నిరుద్యోగి
B) రోజువారీ స్థితి గల నిరుద్యోగి
C) సాధారణ స్థితి గల నిరుద్యోగి
D) ప్రామాణిక స్థితి గల నిరుద్యోగి