136) ఒక దేశ ప్రజలు ఇంకోక దేశంలో అధికంగా పెట్టుబడి పెట్టి విపరీత లాభాలు సాధిస్తే
A) దీనిని స్వదేశంలో ఆర్థికాభివృద్ధిగా పరిగణించవచ్చు.
B) దీనికి స్వదేశీ ఆర్థికాభివృద్ధితో ఎటువంటి సంబంధం ఉండదు
C) దీనిని స్వదేశంలో ఆర్థికాభివృద్ధిగా పరిగణించరాదు.
D) వీటిని అంచనా వేయలేం
137) బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణం, మాంద్యం, రుణ భారం మొదలైన వాటివల్ల ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొన్న సమయంలో ఏ పంచవర్ష ప్రణాళికను ఆమోదించారు?
A) నాల్గవ ప్రణాళిక
B) ఆరవ ప్రణాళిక
C) ఎనిమిదవ ప్రణాళిక
D) తొమ్మిదవ ప్రణాళిక
138) హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం టి-హబ్ ను ఏర్పాటు చేసింది?
A) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
B) మాదాపూర్
C) హైటెక్స్ సిటీ
D) ఐ.ఐ.టి క్యాంపస్
139) భారతదేశంలో జాతీయాదాయాన్ని ప్రధానంగా ఏ పద్ధతుల ద్వారా లెక్కిస్తారు?
ఎ.ఆదాయ పద్ధతి
బి.ఉత్పత్తి పద్ధతి
సి.వ్యయ పద్ధతి
డి.వినిమయ పద్దతి
A) ఎ మరియు బి
B) బి మరియు సి
C) సి మరియు డి
D) డి మరియు ఎ
140) రంగరాజన్ కమిటీ, 2014 ప్రకారం కింది వాటిలో ఏయే తలసరి వ్యయాల ఆధారంగా దారిద్ర్య రేఖను నిర్వచించడం జరిగింది
A) గ్రామీణ ప్రాంతాలలో రూ.52, పట్టణ ప్రాంతాలలో రూ.67
B) గ్రామీణ ప్రాంతాలలో రూ.42, పట్టణ ప్రాంతాలలో రూ.57
C) గ్రామీణ ప్రాంతాలలో రూ.32, పట్టణ ప్రాంతాలలో రూ.47
D) గ్రామీణ ప్రాంతాలలో రూ.22, పట్టణ ప్రాంతాలలో రూ.37