141) పొదుపు నిష్పత్తిని మూలధన ఉత్పత్తి నిష్పత్తితో భాగిస్తే వచ్చేది ఏమిటి?
A) స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు
B) తలసరి ఆదాయ వృద్ధి రేటు
C) జనాభా వృద్ధి రేటు
D) వ్యయార్హ ఆదాయ వృద్ధి రేటు
142) స్వాతంత్య్రానంతర భారతదేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ (క్రింది వాటిలో ) ఏది?
A) నీతి ఆయోగ్
B) ప్రణాళికా సంఘం
C) విత్త సంఘం
D) కేంద్రీయ గణాంక సంస్థ
143) కింది వాటిలో ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అత్యంత ప్రధానమైన సవాళ్లు ఏమిటి?
A) ప్రపంచంలోని అతి సమర్థవంతమైన దేశాలతో ఎలా పోటిపడాలి.
B) సమాజంలోని అధిక వర్గాలకు ఆహార భద్రతలను, ఇతర మౌలిక సౌకార్యాలను ఎలా కలిగించాలి.
C) వ్యవసాయ రంగంలో ఉపాధిని ఏ విధంగా పెంచాలి.
D) ప్రభుత్వ రంగాన్ని ఎలా బలోపేతం చేయాలి.
144) ‘బహుకోణ పేదరిక సూచిక’ ను పేదరికాన్ని కొలిచే ఒక కొత్త సాధనంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
A) 2008
B) 2009
C) 2010
D) 2014
145) అటవీ ప్రాంత విస్తరణ పథకాలు అంతగా సత్ఫలితాలు ఇవ్వకపోవడానికి కింది వాటిలో ఏది ప్రధానమైన కారణం?
A) సారవంతమైన నేల కాకపోవడం & విత్తనాలలో నాణ్యత లోపించడం
B) గాలిలో నాణ్యత లోపించడం
C) నీటిలో నాణ్యత లోపించడం
D) విత్తనాలలో నాణ్యత లోపించడం