11) గ్రామీణ భారతదేశ దారిద్ర్య రేఖను నిర్వచించాలంటే నెలసరి తలసరి వ్యయ తరగతిని మధ్యస్థ బిందువుగా భావిస్తే గ్రామీణ ప్రాంతంలో ఒక రోజుకు ఒక వ్యక్తికి ఎన్ని క్యాలరీల పౌష్టిక ఆహారం అవసరం అవుతుంది?
A) ఒక వ్యక్తికి 2,400 క్యాలరీలు
B) ఒక వ్యక్తికి 2,300 క్యాలరీలు
C) ఒక వ్యక్తికి 2,200 క్యాలరీలు
D) ఒక వ్యక్తికి 2,100 క్యాలరీలు
12) ఒక దేశం మాంద్య పరిస్థితిలోకి ప్రవేశించినప్పుడు చాలా ఉపాధి అవకాశాలు కోల్పోతుంది. కింది వాటిలో అటువంటి పరిస్థితి ఏది?
A) సంఘృష్ట (ఘర్షణ) నిరుద్యోగిత
B) చక్రీయ నిరుద్యోగిత
C) రుతు సంబంధ నిరుద్యోగిత
D) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
13) ఏ భూసేకరణ చట్టమైనా కింది వాటిలో దేనిని తప్పనిసరిగా కాపాడాలి?
A) ప్రభుత్వ ప్రయోజనాలను, పెట్టుబడి చేసేవారి వాణిజ్య ప్రయోజనాలను కాపాడాలి.
B) పరిణామాలను పట్టించుకోకుండా పరిశ్రమల అభివృద్ధిని కాపాడాలి.
C) ఈ చట్టాల తయారీలో గాని, అమలులో గాని స్థానిక సంస్థల పాత్ర ఏమీ ఉండదు.
D) వ్యవసాయదారుల, ఇతర యజమానుల సంక్షేమాన్ని ఒకవైపు; దేశాభివృద్ధి అవసరాలను మరోవైపు కాపాడుకోవాలి.
14) క్రింది వాటిలో ఏ భారత రాష్ట్రం ఎక్కువ శాతం బీదలను/పేదలను కలిగి ఉన్నది?
A) ఆంధ్రప్రదేశ్
B) గుజరాత్
C) మధ్యప్రదేశ్
D) ఒడిశా
15) 1999-2000 నుంచి 2013-2014 వరకు గల కాలంలో స్థూల దేశీయోత్పత్తిలో ద్వితీయ రంగ వాటాలో ఎటువంటి మార్పు జరిగింది?
A) అధిక పెరుగుదల
B) నామమాత్రపు పెరుగుదల
C) నామమాత్రపు తగ్గుదల
D) అధిక తగ్గుదల