16) 2014-15 (AE- ముందస్తు అంచనాలు) లో తెలంగాణలో ప్రస్తుత ధరలలో రాష్ట్ర స్థూల ప్రాంతీయోత్పత్తి (GSDP) లో పారిశ్రామిక రంగ వాటా ఎంత?
A) 25%
B) 28%
C) 35%
D) 37%
17) భారతదేశంలో పదకొండవ పంచవర్ష ప్రణాళికా కాలం (2007-12)లో ఆశించిన (లక్ష్యంగా పెట్టుకున్న) మరియు వాస్తవంగా సాధించిన వృద్ధి రేట్లు ఏవి?
A) 5% మరియు 5.5%
B) 7% మరియు 9%
C) 9% మరియు 5%
D) 9% మరియు 7.5%
18) సరళీకరణ, ప్రపంచీకరణ శక్తులు భారతదేశంలో పెట్టుబడులను ఏ రాష్ట్రాలలో ఎక్కువగా బలోపేతం చేశాయి?
A) వెనుకబడిన రాష్ట్రాల కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో పెట్టుబడులు పెరిగాయి
B) అభివృద్ధి చెందిన రాష్ట్రాల కంటే వెనుకబడిన రాష్ట్రాలలో పెట్టుబడులు పెరిగాయి
C) పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలలో పెట్టుబడులు పెరిగాయి.
D) దేశంలోని అన్ని ప్రాంతాలలో ఒకే మాదిరిగా పెట్టుబడులు పెరిగాయి.
19) అసాధారణ సేవలకుగాను రాజ్యం/రాచరికం / దేశం నుంచి భూమిని బహుమతిగా తీసుకున్న వ్యక్తిని (కింది వాటిలో) ఏమంటారు?
A) జమిందారు
B) ఇనాందారు
C) ప్యూడల్ లార్డ్
D) పట్వారీ
20) ఆవరణ సంతులనాన్ని పూర్వ స్థితికి తేవడానికి అత్యంత ప్రధానమైన పరిష్కార మార్గం (కింది వాటిలో) ఏది?
A) అడవులను పునఃస్థాపించడం, అటవీ ప్రాంతాలన్ని విస్తరించడం
B) అందుబాటులో ఉన్న నీటిని విస్తృతంగా వినియోగించడం.
C) బంజరు భూములను వ్యవసాయ సేద్యానికి అనుకూలంగా మార్చడం.
D) బంజరు భూములను పారిశ్రామిక ఉపయోగానికి వాడడం.