1796 total views , 5 views today
21) అంతర్జాతీయ వర్తకంతో సంబంధం కలిగిన ఆర్థిక వ్యవస్థలో స్థూల దేశీయోత్పత్తితో పోలిస్తే స్థూల జాతీయోత్పత్తి హెచ్చుగా లేదా తక్కువగా ఉండవచ్చు. అందుకు గల కారణం ఏమిటి?
A) పారిశ్రామిక రంగ వృద్ధి
B) వ్యవసాయ రంగ వృద్ధి
C) నికర విదేశీ మిగులు
D) తరుగుదల రేటు
22) కృష్ణా నీటి తగదాల ట్రిబ్యునల్ (రెండవది) ఛైర్మన్ ఎవరు
A) ఆర్. ఎస్. బచావత్
B) బ్రిజేష్ కుమార్
C) జగ్ దీష్ భగవతి
D) ఎస్. పి. శ్రీవాస్తవ
23) కోనేరు రంగారావు భూమి కమిటీ, 2006 నివేదిక ప్రకారం ఒక వ్యక్తికి కేటాయించవలసిన అత్యధిక భూమి ఎంత వరకు పరిమితమై ఉండాలి?
A) ఒక ఎకరం తరి, 2 ఎకరాల కుష్కి భూమి
B) 2 ఎకరాల తరి, 2 ఎకరాల కుష్కి భూమి
C) 2 ఎకరాల తరి, 3 ఎకరాల కుష్కి భూమి
D) 4 ఎకరాల తరి, 6 ఎకరాల కుష్కి భూమి
24) క్రింది జతలను గమనించండి
పంచవర్ష ప్రణాళిక ——- ప్రధాన లక్ష్యం
ఎ.మొదటి పంచవర్ష ప్రణాళిక – వ్యవసాయ రంగం
బి.రెండవ పంచవర్ష ప్రణాళిక – పారిశ్రామిక రంగం
సి.పదకొండవ పంచవర్ష ప్రణాళిక – సమ్మిళిత వృద్ధి
డి.మూడవ పంచవర్ష ప్రణాళిక – స్థిరత్వంతో కూడిన వృద్ధి
పై జతలలో ఏవి. సమ ఉజ్జీగా (సరిపోయినవి) ఉన్నాయి?
A) ఎ, బి మరియు సి
B) బి, సి మరియు డి
C) సి, డి మరియు ఎ
D) డి, ఎ మరియు బి
25) క్రింది జతలను గమనించండి:
ప్రణాళిక | ప్రధాన లక్ష్యం |
ఎ. XI | i.భారీ పరిశ్రమల అభివృద్ధి |
బి. VIII | ii.పేదరిక నిర్మూలన |
సి. V | iii.సమ్మిళిత వృద్ధి |
డి. II | iv.మానవ వనరుల అభివృద్ధి |
A) ఎ-ii,బి-iii,సి-i,డి-iv
B) ఎ-iii,బి-iv,సి-ii,డి- i
C) ఎ-iv,బి-ii,సి-iii,డి-i
D) ఎ-i,బి-ii,సి-iv,డి-iii