26) తెలంగాణ సామాజిక – ఆర్థిక చిత్రం 2016 (తెలంగాణ ప్రభుత్వం) ప్రకారం 2015-16 లో తెలంగాణ రాష్ట్రంలో కింది వాటిలోని ఏ జిల్లాలో అత్యధిక అటవీ ప్రాంత విస్తీర్ణం ఉంది?
A) ఆదిలాబాద్ & ఖమ్మం
B) ఖమ్మం
C) మహబూబ్ నగర్
D) కరీంనగర్
27) తెలంగాణలో వ్యవసాయదారుల ఆత్మహత్యలకు కింది వాటిలో ఏవి సరైన కారణాలు?
ఎ.గొట్టపు బావులు విఫలం అవడం
బి.పత్తిపంట ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడడం
సి.ఉత్పత్తి వ్యయం పెరగడం
డి.ప్రధాన ఆహార పంటగా వరి పెరగడం
A) ఎ, బి మరియు సి
B) బి, సి మరియు డి
C) సి, డి మరియు ఎ
D) బి, ఎ మరియు డి
28) కింది వాటిలోని ఏ తెలంగాణ తాలుకాలలో సాగునీటి కొరతను తీర్చడానికి జూరాల సాగునీరు పథకం (స్టేజ్-1) ను ఉద్ధేశించారు?
A) గద్వాల్, అలంపూర్, వనపర్తి
B) వనపర్తి, సిరిసిల్ల, గద్వాల్
C) అలంపూర్, సంగారెడ్డి, వనపర్తి
D) మెదక్, గద్వాల్, అలంపూర్
29) తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి మొదటి ఫేజ్ లో క్రింది వాటిలోని ఏ కారిడార్ భాగం కాదు?
A) హైదరాబాద్ – నల్గొండ పారిశ్రామిక కారిడార్
B) హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక కారిడార్
C) హైదరాబాద్ – నాగ్ పూర్ పారిశ్రామిక కారిడార్
D) హైదరాబాద్ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్
30) పునరావాసానికి సంబంధించిన జాతీయ విధానంలో ప్రధానమైన లోపం ఏమిటి? కింది వాటిలో అది దేనిని మాత్రమే పట్టించుకుంటుంది?
A) భూమిలేని శ్రామికుల స్థానచలనం
B) పరోక్ష స్థాన చలనం
C) ప్రత్యక్ష స్థాన చలనం
D) గిరిజన ప్రాంతాల ప్రజల స్థాన చలనం