31) సాగవుతున్న స్థూల విస్తీర్ణానికి, సాగవుతున్న నికర విస్తీర్ణానికి మధ్య గల నిష్పత్తి ఏమంటారు? (పంటలు వేసిన స్థూల విస్తీర్ణాన్ని, పంటలు వేసిన నికర విస్తీర్ణంతో భాగిస్తే వచ్చేది ఏమిటి?)
A) వ్యవసాయ సాంద్రత
B) సాగు వ్యవసాయ నిష్పత్తి
C) పంటల సాంద్రత
D) పంటల నిష్పత్తి
32) ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి కింది వ్యాఖ్యలలో ఏది సరైనది ?
A) అటవీ ప్రాంత విస్తరణ పథకాల అమలును 8వ ప్రణాళిక ప్రశంసించింది.
B) అటవీ ప్రాంత విస్తరణ పథకాలలోని కొన్ని లోపాలను 8వ ప్రణాళిక ఎత్తి చూసింది.
C) అటవీ ప్రాంత విస్తరణ అంశాలను 8వ ప్రణాళిక ఉపేక్షించింది.
D) భారతదేశంలో అటవీ ప్రాంత విస్తరణ అనేది అంత ప్రధానమైన అంశం కాదని 8వ ప్రణాళిక తెలిపింది.
33) ప్రస్తుత ఏడాదిలోని నికర జాతీయోత్పత్తిని ఆధార సంవత్సరపు ధరల సూచీతో హెచ్చించి ప్రస్తుత సంవత్సరపు ధరల సూచీతో భాగిస్తే ఏమి వస్తుంది?
A) తలసరి ఆదాయం
B) స్థూల జాతీయోత్పత్తి
C) వాస్తవిక నికర జాతీయోత్పత్తి
D) వాస్తవిక వ్యయార్హ ఆదాయం
34) మన దేశంలో సరళీకరణ దశ సూచించిందేమిటి?
A) జనాభాలో గల అధిక యువశక్తిని మనం సరిగా వాడుకోలేదు.
B) జనాభాలో గల అధిక యువశక్తిని మనం సరిగా వాడుకొన్నాం
C) యువతను వాడుకుని లబ్ధి పొందడానికి అనుకూలమైన వ్యూహాలు ఉన్నాయి.
D) దేశంలో యువశక్తి అధికంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించలేదు.
35) 2013-14 లో తెలంగాణ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో బయోగ్యాస్ కర్మాగారాలను (ప్లాంట్ లను) స్థాపించిన జిల్లా (కింది వాటిలో) ఏది?
A) కరీంనగర్
B) ఆదిలాబాద్
C) ఖమ్మం
D) నిజామాబాద్