46) పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం సందర్భంగా తెలంగాణ ప్రాంతం నుంచి చర్చలో పాల్గొని సవరణలు ప్రతిపాదించిన పార్లమెంటు సభ్యుడు?
A) విజయశాంతి
B) గుత్తా సుఖేందర్ రెడ్డి
C) అసదుద్దీన్ ఒవైసీ
D) కె.చంద్రశేఖర రావు
47) ఈ క్రింది వారిలో ఎవరు నిజాం కాన్వాయ్ పై బాంబు విసిరారు?
A) నారాయణరావు పవార్
B) పండిట్ నరేంద్రజీ
C) వామన్ రావ్ కులకర్ణి
D) టి.వి.నారాయణ
48) ‘తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో టి.ఆర్.ఎస్. అధినేత ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి’ అని పార్లమెంటులో అన్న నాయకుల పేరేమిటి?
A) రాజ్‌నాథ్ సింగ్
B) ఎల్.కె.అద్వాని
C) సుష్మా స్వరాజ్
D) మాయావతి
49) ముల్కీల నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి, ఆంధ్ర ప్రాంతం వారి పలుకుబడితో ఏపీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినది ఎవరు?
A) మర్రి చెన్నారెడ్డి
B) జలగం వెంగళరావ్
C) పి.వి. నరసింహారావు
D) టంగుటూరి అంజయ్య
50) రాజ్యాంగంలోని ఆర్టికల్ – 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదించే బిల్లును ఎవరి పూర్వ అనుమతితో ప్రవేశపెట్టాలి?
A) లోక్ సభ స్పీకర్
B) రాష్ట్రపతి
C) ఉప- రాష్ట్రపతి
D) గవర్నర్