66) ‘శ్రీభాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు కానీ, లేదా యునైటెడ్ కింగ్ డమ్ లోని స్కాటిష్ డివల్యూషన్ వంటి రాజ్యాంగసాధనాలు కానీ’, మార్పు చెందుతున్న దశలో తెలంగాణ అవసరాలను తీర్చలేవు’ అని అన్నదెవరు?
A) ఫజల్ అలీ కమిషన్
B) కొండా వెంకట రంగారెడ్డి
C) వల్లభాయ్ పటేల్
D) జవహర్ లాల్ నెహ్రూ
67) నోట్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ పెద్ద మనుషుల ఒప్పందానికి చేసిన ముఖ్యమైన సవరణ?
A) ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనం తరువాత ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అని మార్చింది.
B) ఏ మార్పు చేయలేదు
C) తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ అవసరం లేదన్నది.
D) ప్రాంతీయ మండలిని ప్రాంతీయ స్థాయి సంఘంగా మార్చి అధికారాలను కుదించింది.
68) కింది తెలంగాణ జిల్లాల్లో కృష్ణా, గోదావరి నదులు ప్రవహించని జిల్లా ఏది?
A) ఖమ్మం
B) నల్గొండ
C) మెదక్
D) ఆదిలాబాద్
69) 1973లో వచ్చిన ఆరు సూత్రాల పథకంలో లేనిది?
A) హైదరాబాద్ లో నూతన కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటు
B) ఉద్యోగ వివాదాలకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు
C) గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
D) రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల సత్వర అభివృద్ధి.
70) ‘ఈ ప్రాంతంలో ఉన్న జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ, దక్షిణ ప్రాంతంలో తుంగభద్రా నది ప్రవహిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతం వారు ఉపాధి కొరకు వందలాది కిలోమీటర్ల దూరం వలస వెళ్లడం ఒక హాస్యాస్పద విషయం’ – ఈ స్టేట్ మెంట్ లో పేర్కొన్న ప్రాంతం ఏది?
A) కరీంనగర్ జిల్లా
B) మహబూబ్ నగర్ జిల్లా
C) నల్గొండ జిల్లా
D) రంగారెడ్డి జిల్లా