71) చివరి నిజాం ప్రభువు చేత స్థాపించబడి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసివేయబడిన ప్రభుత్వరంగంలోని కంపెనీ ఏది?
A) IDPL
B) DRDL
C) Alwyn
D) HMT
72) చంద్రబాబు ప్రభుత్వంచేత అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేయబడిన ‘విజన్ 2020’ అనే పత్రాన్ని ఏ కన్సల్టింగ్ ఏజెన్సీ వారు తయారు చేశారు?
A) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
B) ప్రపంచ బ్యాంక్
C) మెకేన్సి
D) ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్
73) జాబితా-I ను, జాబితా – II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి.
జాబితా-I(తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమాలు) | జాబితా-II(వాటి దర్శకులు) |
ఎ.అంకుర్ | 1.అల్లాణి శ్రీధర్ |
బి.ఒక ఊరి కథ | 2.ఎం. ఉదయ్ కుమార్ |
సి.విముక్తి కోసం | 3.మృణాల్ సేన్ |
డి.కొమురం భీం | 4.శ్యాం బెనెగల్ |
A) ఎ-3,బి-2,సి-4,డి-1
B) ఎ-3,బి-4,సి-2,డి-1
C) ఎ-4,బి-3,సి-2,డి-1
D) ఎ-2,బి-3,సి-1,డి-4
74) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 2005లో ఏర్పాటు చేయబడి ‘తెలంగాణ ప్రాంతంలో తెగల భూసమస్యలపై నివేదిక సమర్పించిన కమిషన్ ఏది?
A) జస్టిస్ కె. రామస్వామి కమిషన్
B) కోనేరు రంగారావు కమిషన్
C) జస్టిస్ రామచంద్రరావు కమిషన్
D) జె.ఎం. గిర్ గ్లానీ కమిషన్ & జస్టిస్ కె. రామస్వామి కమిషన్
75) 1954-55 కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ జాగీర్దారీ వ్యవస్థ రద్దు వల్ల జరిగే సామాజిక, ఆర్థిక పరిణామాలను పరిశోధించడానికి ఏర్పాటు చేసిన రీసెర్చ్ ప్రాజెక్ట్కు ఎవరు సంచాలకులుగా వ్యవహరించారు?
A) ప్రొ|| ఎ.ఎం.ఖుస్రో
B) ప్రొ|| కేశవ అయ్యంగార్
C) ప్రొ॥ రాజా చెల్లయ్య
D) ప్రొ॥ గౌతమ్ మథూర్