91) ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉమ్మడి రాజధానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి?
A) ఉమ్మడి రాజధానిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే హక్కు, అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.
B) కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా ఏర్పడిన మొదటి ఉమ్మడి రాజధాని.
C) ఉమ్మడి రాజధాని ఆస్తుల పంపకం గవర్నర్ అజమాయిషీలో ఉన్నాయి.
D) ఉమ్మడి రాజధాని శాంతి భద్రతల రక్షణ కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉంటుంది.
92) 1968లో సుమారు 20 మంది ఇల్లెందు యువకులతో ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ అనే సంఘాన్ని ఏర్పాటు చేసిన వారు?
A) డా॥ మల్లికార్జున్
B) కొలిశెట్టి రామదాసు
C) ముశ్చర్ల సత్యనారాయణ
D) కె. ఆర్. ఆమాస్
93) హైదరాబాద్ రాష్ట్ర సివిల్ ముఖ్యమంత్రి ఎం.కె. వేల్లోడీ మంత్రివర్గంలో ఈ కింది వారిలో ఎవరు సభ్యులు కారు?
A) కె.వి.రంగారెడ్డి
B) వి.బి. రాజు
C) వినాయకరావు విద్యాలంకార్
D) బూర్గుల రామకృష్ణారావు
94) 1999లో న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడిన ప్రవాస తెలంగాణ వాదుల సంస్థ?
A) అమెరికన్ తెలుగు అసోసియేషన్
B) తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం
C) తెలంగాణ అసోసియేషన్ ఇన్ నార్త్ అమెరికా
D) తెలంగాణ ఎన్ఆర్ఐల అసోసియేషన్
95) 2012లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా జూబ్లీహిల్స్ లో కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న ఆరోపణను ఎదుర్కొన్న ఉద్యమకారిణి ఎవరు?
A) బాల లక్ష్మి
B) రత్నమాల
C) జయ వింధ్యాల
D) విమలక్క