6) జాబితా-I ను, జాబితా – II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి.
జాబితా-I(గిరిజన తెగలు) | జాబితా-II(తెలంగాణాలో వారు అధికంగా నివసించే ప్రాంతాలు) |
ఎ.పర్దాన్లు | 1.మహబూబ్ నగర్ |
బి.చెంచులు | 2.ఖమ్మం |
సి.కొండరెడ్లు | 3.ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం |
డి.రాచకోయలు | 4.ఆదిలాబాద్ |
A) ఎ-2,బి-4,సి-3,డి-1
B) ఎ-2,బి-3,సి-2,డి-1
C) ఎ-4,బి-1,సి-2,డి-3
D) ఎ-1,బి-3,సి-2,డి-4
7) తెలంగాణను సాధించడానికి ప్రొ॥ జయశంకర్ ప్రతిపాదించిన మూడు ప్రధాన అంశాలు ఏవి?
A) రాస్తారోకో, ఆర్థిక మూలాలనునిరోధించుట, పార్లమెంటులో బిల్లు
B) తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామా, రాజ్యాంగ సంక్షోభం, జాతీయ పార్టీల ఆమోదం
C) మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం.
D) అవగాహన, ఉద్యమం, రాజకీయ ప్రక్రియ
8) గోదావరి నదిపై ఇచ్చంపల్లి ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలానికి దిగువన గంగారం గ్రామం దగ్గర నిర్మాణమైన ఎత్తిపోతల పథకం?
A) దేవాదుల ఎత్తిపోతల పథకం
B) అలీసాగర్ ఎత్తిపోతల పథకం
C) సింగూర్ ఎత్తిపోతల పథకం
D) గుత్ప ఎత్తిపోతల పథకం
9) 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ఈ విధంగా పేర్కొంది?
A) తెలంగాణ విషయంలో ఒక కమిటీని నియమిస్తాం
B) తెలంగాణ విషయంలో మొదటి ఎన్.ఆర్.సి. నివేదికలో వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తాం.
C) 2009 లోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం.
D) అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో తెలంగాణ ఏర్పాటు
10) ‘నక్సలైట్లే దేశభక్తులు’, ‘నక్సలైట్ల ఎజెండాయే నా ఎజెండా’ అంటూ మొట్టమొదటిగా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు?
A) మర్రి చెన్నారెడ్డి
B) కె. చంద్రశేఖరరావు
C) భవనం వెంకట్రావు
D) ఎన్.టి.రామారావు