126) తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న అందరు స్థానికేతర (నాన్-ముల్కీ) ప్రభుత్వ ఉద్యోగులను వారి ఉద్యోగాల నుంచి రిలీవ్ చేయడానికి ఉద్దేశించిన జి.వో. నెం. 36 ను కొట్టివేసిన జడ్జి పేరు?
A) జస్టిస్ ఆవుల సాంబశివరావ్
B) జస్టిస్ ఒ. చిన్నపరెడ్డి
C) జస్టిస్ పి. ఓబుల్ రెడ్డి
D) జస్టిస్ గోపాలరావ్ ఎక్ బోటె
127) జాబితా-I ను, జాబితా -II తో జతపర్చి, దిగువ ఇచ్చిన అప్షన్లనుంచి జవాబును ఎంచుకోండి.
జాబితా-I(తెలంగాణ మాండలీకం) | జాబితా-II(పలుకుబడులు/అర్ధాలు) |
ఎ.అగ్గువ | 1.పెండ్లి సమయంలో కుమ్మరి వారి ఇంటి నుండి తెచ్చే కుండలు |
బి.ఐరేండ్లు | 2.ధర తక్కువ |
సి.కాగు | 3.పెద్ద కుండ |
డి.కైకిలి | 4.కూలి |
A) ఎ-2,బి-1,సి-3,డి-4
B) ఎ-1,బి-2,సి-4,డి-3
C) ఎ-1,బి-2,సి-3,డి-4
D) ఎ-4,బి-1,సి-3,డి-2
128) 2001లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఎక్కడ జరిగింది?
A) జలదృశ్యం
B) తెలంగాణ భవన్
C) బూర్గుల రామకృష్ణారావు భవన్
D) తెలుగుతల్లి భవన్
129) సాంప్రదాయ బిద్రీ హస్తకళలలో ఉపయోగించే వస్తువులు ఏవి?
A) నలుపు రంగును అలమరిచిన కంచు, జింక్, బంగారు రేకుల మిశ్రమం.
B) నలుపు రంగును అలమరిచిన కంచు, రాగి, బంగారు రేకుల మిశ్రమం.
C) నలుపు రంగును అలమరచిన జింక్, ఇత్తడి, వెండి రేకుల మిశ్రమం
D) నలుపు రంగును అలమరిచిన జింక్, రాగి, వెండి రేకుల మిశ్రమం.
130) కింది వారిలో నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి ఎవరు ఈ విధంగా వ్యాఖ్యానించారు?
“భాషా సారూప్యం వాంఛనీయమే అయితే ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వాళ్లు ఉండడం మంచిదే, కానీ ఒక భాష మాట్లాడే వాళ్లంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనడం మూర్ఖత్వమే అవుతుంది.”
A) థార్ కమిటీ
B) వాంఛూ కమిటీ
C) డా॥బి.ఆర్.అంబేద్కర్
D) ఫజల్ అలీ కమిటీ