136) 1980వ దశకంలో ‘మా తెలంగాణ’ అనే వార్తాపత్రికను ప్రారంభించిన సంస్థ ఏది?
A) తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం
B) సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్
C) తెలంగాణ ఇన్ ఫర్మేషన్ ట్రస్ట్
D) తెలంగాణ బుక్ ట్రస్ట్
137) బీజెపీ నాయకులు సి. జంగారెడ్డి ఏ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1984లో లోక్సభకు ఎన్నికయ్యారు?
A) మహబూబాబాద్
B) వరంగల్
C) హన్మకొండ
D) భువనగిరి
138) మంజీరా నదిపై హైదరాబాద్ లోని ప్రజలకు మంచినీటిని, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించడానికి 1980-90 మధ్యకాలంలో నిర్మించబడిన ప్రాజెక్ట్?
A) ఇచ్చంపల్లి ప్రాజెక్ట్
B) సింగూర్ ప్రాజెక్ట్
C) శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్
D) నిజాం సాగర్ ప్రాజెక్ట్
139) ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం. అందుకు తగిన విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు’ అన్న ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు జారీ అయింది?
A) 23 డిసెంబర్, 2009
B) 30 జులై, 2013
C) 2 జులై, 2014
D) 9 డిసెంబర్, 2009
140) పెద్ద మనుషుల ఒప్పందం హామీలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నదని 1969 జనవరిలో పాల్వంచలో మొదలైన ఆందోళన నేపథ్యంలో మిగతా అంశాలతో పాటు తెలంగాణ రెవెన్యూ మిగులు ఎంత ఉందో అంచనా వేయడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ?
A) హరిభూషణ్ కమిటీ
B) సిహెచ్.హన్మంతరావు కమిటీ
C) కుమార్ లలిత్ కమిటీ
D) గౌతమ్ మాధుర్ కమిటీ