31) తెలంగాణ విషయంలో శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పరిష్కారాలు సూచించింది. వీటిలో మొట్టమొదటిది ఏది?
A) హైదరాబాద్ మహానగర పాలిత ప్రాంతాన్ని కేంద్రపాలిత రాజ్యాంగం చేసి తెలంగాణ ఏర్పాటు చేయాలి.
B) తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి.
C) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలి.
D) హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలి.
32) 1978లో జగిత్యాలలో జరిగిన ‘జైత్రయాత్ర’ ఎవరికి సంబంధించిన ప్రజా ప్రదర్శన?
A) రైతు కూలీలు
B) ఎన్ జివోలు
C) నిరుద్యోగుల
D) విద్యార్థుల
33) భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించే సమయంలో ఈ కింది వారిలో ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు?
A) లియోన్ ట్రాట్ స్కి
B) జోసెఫ్ స్టాలిన్
C) మికాయిల్ బుకారిన్
D) లియోనెడ్ బ్రెజ్నేర్
34) దళితులను ఆదిహిందువులుగా ప్రకటిస్తూ భాగ్యరెడ్డి వర్మ 1906 లో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఏది?
A) ఆది హిందూ సమాజ్
B) జగన్ మిత్రమండలి
C) రిఫార్మ్స్ అసోసియేషన్
D) హ్యూమానిటేరియన్ లీగ్
35) ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణలోని 8వ సెక్షన్ ప్రకారం
A) ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని ప్రజల ప్రాణాలు, స్వాతంత్ర్యం, ఆస్తుల రక్షణకోసం గవర్నర్ కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి.
B) రాష్ట్ర గవర్నర్ కు ఉమ్మడి రాజధానిలో అత్యవసర పరిస్థితులు విధించే అధికారం ఉంది.
C) ఉమ్మడి రాజధాని పన్ను ఆదాయంలో రెండు రాష్ట్రాలకు సమాన వాటా ఉంటుంది.
D) ఉమ్మడి రాజధాని ప్రాంతంపై చట్టంచేసే అధికారం రెండు రాష్ట్రాలకు ఉంది.