36) క్రింది వారిలో ఏ ముస్లిం చరిత్రకారుడు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా ‘తెలంగాణ’ అనే పదాన్ని ఉపయోగించాడు?
A) ఫెరిష్టా
B) అల్బరూనీ
C) ఇబ్న్-ఖల్టూన్
D) అబుల్ ఫజల్ or ఫెరిష్టా
37) జాబితా-I ను, జాబితా-II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి.
జాబితా-I(సంఘటన) | జాబితా-II(జరిగిన సంవత్సరం) |
ఎ)హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన | 1.1950 |
బి)జాగిర్దారీ వ్యవస్థ రద్దు | 2.1953 |
సి)రక్షిత కౌలుదార్ల హక్కుల చట్టం అమలు | 3.1938 |
డి)మొదటి రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ నియామకం | 4.1949 |
A) ఎ-2,బి-1,సి-3,డి-4
B) ఎ-3,బి-1,సి-4,డి-2
C) ఎ-3,బి-4,సి-1,డి-2
D) ఎ-2,బి-3,సి-1,డి-4
38) 1977లో కో-ఆర్డినేషన్ కమిటీ (CoC) ఆధ్వర్యంలో విప్లవోద్యమ నిర్మాణానికి జరిగిన సదస్సులో విడుదల చేసిన సైద్ధాంతిక డాక్యుమెంటు పేరు ఏది?
A) రోడ్ టు రివల్యూషన్
B) న్యూ డెమోక్రాటిక్ రివల్యూషన్
C) ఇండియన్ రివల్యూషనరీ ఆర్మీ
D) ద ప్రోలెటేరియన్ పాఠ్
39) జాబితా-I ను, జాబితా-II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి.
జాబితా-I(ప్రస్తుత నామము) | జాబితా-II(పూర్వ నామము) |
ఎ)హుజూర్ నగర్ | 1.ఎలగందుల |
బి)ఆసిఫాబాద్ | 2.పోచంచెర్ల |
సి)కరీంనగర్ | 3.ఇందూరు |
డి)నిజామాబాద్ | 4.జిల్లా జనగామ |
A) ఎ-2,బి-4,సి-1,డి-3
B) ఎ-1,బి-3,సి-4,డి-2
C) ఎ-2,బి-3,సి-4,డి-1
D) ఎ-1,బి-2,సి-4,డి-3
40) మొదటి తెలుగు టాకీ చిత్రమైన ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన తెలంగాణ బాల కళాకారుని పేరు?
A) క్రిష్ణాజీరావ్ షిండే
B) గోవిందరావు
C) టి.ఎల్.కాంతారావు
D) చందాల కేశవదాసు