46) ప్రపంచ నీటి (జల) దినం (WWD) నేపథ్యం (ధీం)కు సంబంధించి కింది వాటిని జతపరచండి:
(WWD) నేపథ్యం | సంవత్సరం |
ఎ. జలాన్ని వ్యర్థం చేయడం ఎందుకు | 1.2018 |
బి. జలం మరియు సుస్థిరమైన(నిరంతర) అభివృద్ధి | 2.2017 |
సి. జలం కొరకు ప్రకృతి | 3.2016 |
డి. మంచి నీరు మంచి ఉద్యోగాలు | 4.2015 |
5.2014 |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-2, బి-1, సి-5, డి-4
B) ఎ-3, బి-4, సి-2, డి-1
C) ఎ-2, బి-4, సి-1, డి-3
D) ఎ-4, బి-3, సి-1, డి-5
47) డిసెంబరు 1991లో సోవియట్ యూనియన్ కూలిపోవడానికి కింది వాటిలో ఏవి కారణభూతమయ్యాయి ?
ఎ. ఆర్థిక వ్యవస్థ స్తంభించటం
బి. గ్లాసునోస్తు విధానాల కారణంగా పోటీతత్వ రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా అవతరించడం
సి. సైనిక వ్యవస్థ అత్యధిక దృష్టి పెట్టటం
డి. జాతులు విడిపోవడం
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ, సి మరియు డి మాత్రమే
B) ఎ మరియు డి మాత్రమే
C) ఎ, బి మరియు సి మాత్రమే
D) బి, సి మరియు డి మాత్రమే
48) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. 1921లో ఆంధ్ర జన కేంద్ర సంఘ స్థాపన, అది 1930లో ఆంధ్ర మహాసభగా అభివృద్ధి చెందడం, నిజాం రాజ్యంలో ప్రజా చైతన్యం, జాగృతికి గట్టి పునాదులేర్పరచాయి
బి. తెలంగాణ ప్రజలలో 80 శాతం మంది తమ మాతృ భాష తెలుగులో, అలాగే మరట్వాడలో మరాఠీ మరియు కన్నడ భాషల్లో అంటే ప్రజల భాషలలో కార్యకలాపాలు నిర్వహిం చడం మరియు ప్రజల అభిప్రాయాలను రేకెత్తించడానికి సరైన, సమర్ధవంతమైన వేదికను అందించింది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మాత్రమే సరియైనది
B) బి మాత్రమే సరియైనది
C) ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
D) ఎ మరియు బి రెండూ సరియైనవి
49) పర్యావరణ వ్యవస్థలో ప్రధానంగా శిథిలం (డీ కంపోజీ) చేసేవి ఏవి ?
ఎ. శిలీంధ్రాలు (ఫంగి)
బి. కీటకాలు
సి. ప్రోకారియోట్స్
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) బి మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు
C) ఎ మరియు బి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే
50) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. బెనరస్ లో ‘ఇండియన్ అసోసియేషన్’ స్థాపించబడింది
బి. ‘డక్కా అనుశీలన్ సమితి’ని 2009లో నెలకొల్పారు
సి. దాదాబాయి నౌరోజీచే ‘ఈస్ట్ ఇండియా అసోసియేషన్’ ఏర్పాటు చేయబడింది
డి. క్రీ.శ.1782లో సల్ బాయ్ సంధి జరిగింది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) సి మరియు డి మాత్రమే
B) ఎ, సి మరియు డి మాత్రమే
C) ఎ మరియు బి మాత్రమే
D) బి మరియు సి మాత్రమే