51) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తాడు
బి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వపు ప్రధాన న్యాయ సలహా దారుణ్ణి (అధికారిని) ‘సొలిసిటర్ జనరల్’ అని వ్యవహరిస్తారు
సి. లోక్ అదాలత్ అనేది ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల సంస్థ. అది చట్టబద్ధమైనది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) బి మరియు సి మాత్రమే
B) ఎ మరియు సి మాత్రమే
C) ఎ, బి మరియు సి
D) ఎ మరియు బి మాత్రమే
52) 2011 జనాభా గణాంకాలు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రకారం తెలంగాణలోని కింది జిల్లాల్లో ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయం 2016-17 (FRE) రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే అధికంగా ఉంది. ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయం ఆధారంగా ఈ జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి :
ఎ. హైదరాబాద్
బి. మేడ్చల్-మల్కాజ్ గిరి
సి. రంగారెడ్డి
డి. సంగారెడ్డి
సరియైన క్రమంను/జవాబును ఎంపిక చేయండి :
A) డి, బి, ఎ మరియు సి
B) సి, ఎ, బి మరియు డి
C) ఎ, సి, బి మరియు డి
D) బి, ఎ, సి మరియు డి
53) ‘తెలంగాణ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం’ గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. దీనిని ‘తెలంగాణ పల్లె ప్రగతి పథకం’ అని కూడా పిలుస్తారు
బి. చిన్న, సన్నకారు రైతులు మరియు ఎస్సీ/ఎస్ కుటుంబాలు ఈ స్కీం వల్ల లబ్ది పొందుతారు
సి. తెలంగాణ రాష్ట్ర ‘సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ’ (SERP) ఈ పథకాన్ని అమలు చేస్తుంది
డి. ప్రపంచ బ్యాంకు ఈ పథకానికి గాను తెలంగాణ రాష్ట్రానికి రుణాన్ని ఇవ్వడానికి అనుమతిని ఇచ్చింది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు డి మాత్రమే
B) ఎ, బి, సి మరియు డి
C) ఎ, బి మరియు సి మాత్రమే
D) బి, సి మరియు డి మాత్రమే
54) కింది వివరణ (వ్యాఖ్య)లలో సరియైనది/ఏ ఏది/వి ?
ఎ. సౌభ్రాతృత్వం అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక విలువ
బి. ఇది మౌలిక విలువ ఎందుకంటే భారత రాజ్యాంగంలో చెప్పబడింది
సి. ఇది మౌలిక విలువ కాదు ఎందుకంటే భారత రాజ్యాంగంలో చెప్పబడలేదు
డి. ఇది మౌలిక విలువ ఎందుకంటే భారత రాజ్యాంగం పీఠికలో ఒక భాగం మరియు భారత రాజ్యాంగం ప్రాథమిక వ్యవస్థలో భాగంగా గుర్తించారు
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) సి మాత్రమే
B) ఎ, బి మరియు డి మాత్రమే
C) ఎ మరియు బి మాత్రమే
D) ఎ మరియు డి మాత్రమే
55) కింది వారిలో సులేమాన్ అనే అరబ్ పర్యాటకుడి చేత అతి గొప్ప సామ్రాజ్యాధిపతిగా కీర్తించబడిన రాష్ట్రకూట పాలకుడు ఎవరు ?
A) గోవింద-3
B) అమోఘ వర్ష
C) దంతి దుర్గ
D) క్రిష్ణ-1