56) ప్రపంచ న్యాయ ప్రాజెక్టు యొక్క ‘న్యాయ నియమావళి సూచిక 2017-2018’ 113 దేశాలను అధ్యయనం చేసింది. దీని ప్రకారం భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకు ఎంత ? మరియు సున్నా(0) నుంచి ఒకటి (1) మద్యలో ఎంత స్కోర్ సాధించింది?
A) 62వ ర్యాంకు మరియు 0.52 స్కోరు
B) 91వ ర్యాంకు మరియు 0.41 స్కోరు
C) 58వ ర్యాంకు మరియు 0.53 స్కోరు
D) 59వ ర్యాంకు మరియు 0.52 స్కోరు
57) ‘ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ 2018’ కింద ప్రాజెక్టుల అమలులో గొప్ప ఊపందుకుంటున్నందుకు కింది నగరాల్లో ‘సిటీ అవార్డు’ కోసం ఎంపిక చేయబడిన నగరం ఏది ?
A) కొచ్చి
B) జబల్ పూర్
C) లూధియానా
D) సూరత్
58) కింది వాటిని జతపరచండి :
తెలంగాణ మాండలిక పదాలు | వాటి అర్ధాలు |
ఎ. ఇగం | 1. ధాన్యం దంచేటప్పుడు రోటిపై ఉపయోగించే లోహపు పరికరం |
బి. తపుకు | 2. గట్టి కర్ర |
సి. కుందెన | 3. లోహపు ప్లేటు |
డి. గుత్ప | 4. చలి/చల్లని |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-1, బి-3, సి-2, డి-4
B) ఎ-4, బి-3, సి-1, డి-2
C) ఎ-4, బి-1, సి-3, డి-2
D) ఎ-2, బి-3, సి-1, డి-4
59) కింది వాటిని జతపరచండి :
వ్యక్తి | సంస్థ |
ఎ. ఎ.డి. గోర్ వాలా | 1. తెలంగాణ ప్రాంతీయ సంఘం |
బి. సుందర్‌లాల్ | 2. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ |
సి. కె.ఎం.ఫణిక్కర్ | 3. కమిటీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ రీ ఆర్గనైజేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎకానమి |
డి. జె. చొక్కారావు | 4. ఎక్సెస్ ఆఫ్ మిలటరీ ఇన్ హైదరాబాద్ |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-3, బి-4, సి-2, డి-1
B) ఎ-4, బి-1, సి-2, డి-3
C) ఎ-1, బి-2, సి-3, డి-4
D) ఎ-4, బి-3, సి-2, డి-1
60) భారత రాజ్యాంగ పీఠికకు సంబంధించిన కింది వివరణలను పరిశీలించండి :
ఎ. లక్ష్యాలు, ఆశయాల తీర్మానంపై భారత రాజ్యాంగ పీఠిక ఆధారపడింది
బి. భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం రాజ్యాంగం తన అధికారాన్ని భారత ప్రజల నుండి గ్రహిస్తుంది
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు బి రెండూ సరియైనవి
B) ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
C) ఎ మాత్రమే సరియైనది
D) బి మాత్రమే సరియైనది కాదు