61) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. ముల్కి లీగ్ దక్కన్ జాతీయ వాదాన్ని ప్రచారం చేసింది
బి. హైదరాబాద్, ఇండియాల ఐక్య భాషగా హిందూస్థానీని ముల్కీ లీగ్ అభిలషించింది
సి. హైదరాబాదీలను తప్పుదోవ పట్టించేందుకు బ్రిటీష్ వారు మతతత్వాన్ని సృష్టించారని ముల్కి లీగ్ భావించింది
డి. ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ విలీనాన్ని ముల్కి లీగ్ కోరింది
సరియైనవి కాని వివరణ(ల)ను ఎంపిక చేయండి :
A) డి మాత్రమే
B) ఎ, బి మరియు సి మాత్రమే
C) ఎ మరియు బి మాత్రమే
D) సి మరియు డి మాత్రమే
62) కింది వివరణలను పరిశీలించండి :
ఎ. వెనుకబడిన కులాలకు 100 శాతం ఉత్పాదక సబ్సిడీ పథ కాన్ని ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
బి. ప్రభుత్వం బీసీలకు రూ. 2 లక్షల వరకు పెట్టుబడి మద్దతును అందిస్తుంది
సి. వెనుకబడిన తరగతులలో సుమారు 70 కులాలలో నైపుణ్యం గల ప్రజలకు పెట్టుబడి మద్దతుకు ఇది ఉద్దేశించబడింది
డి. మంగలి, కమ్మరి, కంసాలి, కుమ్మరి, బేల్దారి (సుతారి), చిన్న వ్యాపారస్థులు ఈ పథకం ద్వారా లాభం పొందుతారు
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు డి మాత్రమే
B) ఎ, బి మరియు డి మాత్రమే
C) ఎ మరియు బి మాత్రమే
D) సి మరియు డి మాత్రమే
63) శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును అధ్యయనం చేయడానికి కేంద్ర హోం మంత్రి ద్వారా ఏర్పాటు చేయబడిన అన్ని పార్టీల సమావేశంను బహిష్కరించిన పార్టీలు ఏవి ?
A) బిజెపి, టిడిపి, టిఆర్ఎస్ మరియు ఎఐఎంఐఎం
B) బిజెపి, టిఆర్ఎస్, టిడిపి, ఎఐఎంఐఎం, సిపిఐ మరియు సిసిఐ(ఎం)
C) బిజెపి మరియు టిఆర్ఎస్
D) బిజెపి, టిడిపి మరియు టిఆర్ఎస్
64) కింది వాటిని జతపరచండి :
జాబితా-1 | జాబితా-2 |
ఎ. ఒబెదుల్లా | 1. ఫ్రాన్స్ |
బి.బర్కతుల్లా | 2. జెనీవా |
సి. మదాంకామా | 3. జర్మనీ |
డి. లాలా హర్‌దయాళ్ | 4. అఫ్ఘనిస్థాన్ |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-2, బి-4,సి-3,డి-1
B) ఎ-4, బి-3, సి-1, డి-2
C) ఎ-3, బి-1, సి-2, డి-4
D) ఎ-1, బి-2, సి-3, డి-4
65) కింది వాటిని జతపరచండి :
పుస్తకం | రచయిత |
ఎ. గాథా సప్తసథి | 1. గుణాడ్యుడు |
బి. పండితారాధ్య చరిత్ర | 2. హాలుడు |
సి. బృహత్ కథ | 3. సామల సదాశివ |
డి. యాది | 4. పాల్కురికి సోమనాథుడు |
5. పాల్కురికి శ్రీనాథుడు |
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
A) ఎ-4, బి-3, సి-1, డి-2
B) ఎ-3, బి-1, సి-2, డి-3
C) ఎ-2, బి-5, సి-3, డి-1
D) ఎ-2, బి-4, సి-1, డి-3