TSPSC Group 4 Paper 1 Previous Paper 2018 GENERAL KNOWLEDGE And GENERAL STUDIES Questions With Answers and Explanation

66) తెలంగాణ గ్రామ జ్యోతి స్కీం గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. ఆగస్టు 15, 2015 నాడు ఈ స్కీంను ప్రారంభించారు
బి. ఈ స్కీం గ్రామాల సాధికారతకు సంబంధించింది
సి. నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రారంభించాడు
డి. ప్రణాళికా రచన మరియు సామూహిక నిర్ణయాలలో ప్రజల భాగస్వామ్యంతో సమ్మిళిత మరియు సంపూర్ణమైన గ్రామ అభివృద్ధి చేయడం ఈ స్కీం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) బి, సి మరియు డి మాత్రమే
B) ఎ మరియు డి మాత్రమే
C) ఎ మరియు సి మాత్రమే
D) ఎ, బి మరియు సి మాత్రమే

View Answer
B) ఎ మరియు డి మాత్రమే

67) మగధనేలిన కింది చక్రవర్తులను వారి పాలనా కాలాన్ననుసరించి సరైన క్రమంలో అమర్చండి :
ఎ. బిందుసారుడు
బి. బింబిసారుడు
సి. అశోకుడు
డి. అజాత శత్రువు
సరియైన క్రమాన్ని/జవాబును ఎంపిక చేయండి :

A) బి, డి, ఎ, సి
B) డి, సి, బి, ఎ
C) ఎ, సి, డి, బి
D) బి, ఎ, డి, సి

View Answer
A) బి, డి, ఎ, సి

68) ‘ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా’ కథా సంకలనాన్ని ఎవరు వెలువరించారు ?

A) కాసుల ప్రతాపరెడ్డి
B) కె.వి.నరేందర్
C) పులుగు శ్రీనివాస్
D) పసునూరు రవీందర్

View Answer
D) పసునూరు రవీందర్

69) రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులలో ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తారు ?

A) భారత ప్రధాన న్యాయమూర్తి
B) భారత ప్రధాన న్యాయమూర్తిచే నియమింపబడిన వ్యక్తి
C) ప్రధాన మంత్రి
D) లోకసభ స్పీకర్

View Answer
A) భారత ప్రధాన న్యాయమూర్తి

70) కింది పదవులలో దేనితో ప్రధాన మంత్రి పదవిని పోల్చి చూడవచ్చు ?
ఎ. క్యాబినెట్ అధినేత
బి. విదేశీ సంబంధాల విషయాలపై ముఖ్య ప్రతినిధి
సి. రాజ్య అధిపతి
డి. పార్లమెంట్ నాయకుడు
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) ఎ, బి మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు డి మాత్రమే
C) ఎ మరియు సి మాత్రమే
D) సి మరియు డి మాత్రమే

View Answer
B) ఎ, బి మరియు డి మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
16 + 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!