76) 1946-48 సంవత్సరాల్లో వెనుకబడిన తాలూకాలైన కిన్వట్, బోల్ మరియు సిర్పూర్ ఆదిలాబాద్ జిల్లాలో, .హుజూరాబాద్ కరీంనగర్ జిల్లాలో, బూర్గంపహాడ్ వరంగల్ జిల్లాలో, బీద రైతులు ఆరుగురు రెవెన్యూ ఇన్ స్పెక్టర్లను చంపేందుకు ఒక సెకండ్ తాలూకారు, ఆరుగురు రెవెన్యూ ఇన్ స్పెక్టర్లను శారీరక హింసకు గురిచేసేందుకు పూనుకోవడానికి బలీయమైన కారణం ఏమిటి ?
A) హెచ్చు రేట్లో భూమి శిస్తు
B) కౌలుదార్లను భూములనుండి తరచుగా, సులభంగా తొలగించడం
C) యుద్ధ నిధి వసూళ్లు
D) లెవీ ధాన్యాన్ని బలవంతంగా, అన్యాయంగా, అక్రమంగా వసూలు చేయడం
77) సింధూ (ఇండస్) నది యొక్క ఉపనదులు కింద ఇవ్వబడ్డాయి :
ఎ. జీలం
బి. సట్లెజ్
సి. చేనాబ్
డి. రావి
ఉత్తరం నుండి దక్షిణానికి సింధూ నది యొక్క ఉప నదుల సరైన క్రమాన్ని ఎంపిక చేయండి :
A) బి, ఎ, సి మరియు డి
B) సి, ఎ, డి మరియు బి
C) ఎ, సి, డి మరియు బి
D) ఎ, డి, బి మరియు సి
78) కింది వాటిలో ఏ స్కీంలు జన్ సురక్షా యోజనలోకి వస్తాయి ?
ఎ. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
బి. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన
సి. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
డి. అటల్ పెన్షన్ యోజన
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ, సి మరియు డి మాత్రమే
B) ఎ, బి, సి మరియు డి
C) ఎ, బి మరియు సి మాత్రమే
D) బి, సి మరియు డి మాత్రమే
79) ప్రధాన మంత్రి సురక్ష బీమా యోన గురించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. ప్రమాదానికి గురయ్యి లేదా మొత్తం వైకల్యం అయితే స్కీం యొక్క రిస్క్ పరిమితి రెండు లక్షల రూపాయలు
బి. పాక్షిక వైకల్యం అయితే ఒక లక్ష రూపాయలు
సి. 18-70 సంవత్సరం వయస్సు మధ్యగల వ్యక్తులు ఈ స్కీం వల్ల లబ్ది పొందుటకు అర్హులు
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ మరియు బి మాత్రమే
B) బి మరియు సి మాత్రమే
C) ఎ, బి మరియు సి
D) ఎ మాత్రమే
80) స్వాతంత్ర్యం సాధించిన తరువాత భారత ప్రభుత్వం జాతీయాదాయ అంచనాలను అధికారికంగా సంకలనం చేయడానికి 1949 లో ‘జాతీయాదాయ కమిటీని స్థాపించింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు ?
ఎ. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
బి. ఆచార్య ఆర్.సి.దత్
సి. ఆచార్య పి.సి.మహలనోబిస్
డి. ఆచార్య డి.ఆర్.గాడ్జెల్
ఇ. ఆచార్య సుఖమోయ్ చక్రవర్తి
ఎఫ్. ఆచార్య వి.కె.ఆర్.వి.రావు
సరియైన జవాబును ఎంపిక చేయండి :
A) ఎ, బి మరియు సి మాత్రమే
B) సి, డి మరియు ఎఫ్ మాత్రమే
C) ఎ, ఇ మరియు ఎఫ్ మాత్రమే
D) బి, డి మరియు ఇ మాత్రమే